Home » గాఢ నిద్రలో మీ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించిందా..? ఎంత డేంజర్ ఓ తెలుసా..?

గాఢ నిద్రలో మీ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించిందా..? ఎంత డేంజర్ ఓ తెలుసా..?

by Sravya
Published: Last Updated on
Ad

ఒక్కొక్కసారి నిద్రలో మనకి భయంకరమైన పీడకలలే కాకుండా తుళ్ళి పడడం లేదంటే ఎవరైనా మన మీద కూర్చున్నట్టు అనిపించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.

Advertisement

 

గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఛాతి మీద ఎవరో కూర్చున్నట్లు ఒకొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు కూడా సహజంగా వస్తూ ఉంటాయి ఒక్కసారి ఛాతి అంతా కూడా బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరో కూర్చున్నట్లు ఉంటుంది లేదా మన కూడా లేవలేకపోతూ ఉంటారు గొంతుని కూడా పట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. అరవలేకపోతుంటారు. కనీసం నోటి నుండి మాట కూడా రాదు.

Advertisement

అయితే ఎంత అరిచినా గోల చేసినా ఎవరికీ వినపడదు. అయితే దీనిని స్లీప్ పెరలాసిస్ అని అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదంటే తెల్లవారుజామున నిద్ర లేచే సమయానికి ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కలలు ఎలా వస్తాయో స్లీప్ పెరాలసిస్ కూడా అంతే. కలలు వచ్చే సమయంలోనే ఇలా స్లీప్ పెరాల్సిస్ కూడా వస్తూ ఉంటుంది. స్లీప్ పెరాలసిస్ వచ్చాక కొన్ని సెకండ్లలోనే మెలకువ వచ్చేస్తుంది. అప్పుడే ఏదో అయిపోయిందని అర్థమవుతుంది.

దెయ్యం వచ్చి కూర్చుందేమో అని భయపడిపోతూ ఉంటారు. చాలామంది స్లీప్ పెరలాసిస్ ని దెయ్యమని భావిస్తారు అర్ధరాత్రి పూట దెయ్యం వచ్చింది. ఎటు కదల లేకపోయనున్న గొంతు పట్టుకుంది ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇది స్లీప్ పెరాలసిస్. కనీసం ఒక నిమిషం నుండి నిమిషమున్నర వరకు ఈ స్లీప్ పెరాలసిస్ ఉంటుంది. ఈ స్లీప్ పెరాలసిస్ ని అడ్డంగా పెట్టుకుని దెయ్యాలు ఉన్నాయి. దెయ్యం పట్టుకుంది అని చాలామంది నమ్ముతారు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading