Home » తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవి త్యాగం చేసిన నళిని గుర్తుందా ? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ?

తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవి త్యాగం చేసిన నళిని గుర్తుందా ? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ?

by Sravya
Ad

డీఎస్పీ నళిని గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఆమె అందరికీ సుపరిచితమే 2012 తెలంగాణ ఉద్యమ కాలం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో నళిని తన డిఎస్పి పదవిని కూడా వదిలేసింది. తెలంగాణ కోసం పోరాడుతున్న అన్నాచెల్లెళ్ల పై వ్యతిరేకంగా డ్యూటీ చేయలేక ఆమె రాజీనామా చేసేసింది. ఈమె కి సంబంధించిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అప్పట్లో ఆమె ఢిల్లీలో దీక్ష చేసింది. రెండు సార్లు తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే ఇన్నాళ్లు ఈమె ఏమైపోయింది అని ప్రతి ఒక్కరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఉద్యమ పార్టీ ప్రభుత్వం కూలిపోయాక ఇప్పుడు అందరి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి ఆమెకి మళ్లీ పోస్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. తెలంగాణ పేరిట ఎంతో మంది ఎన్నో సంపాదించుకున్నారు.

Advertisement

Advertisement

అనర్హులు కూడా అధికారాన్ని అనుభవించారు అయితే ఉద్యమ కారణంగా పోరాడిన ఆమెకి న్యాయం మాత్రం జరగలేదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఒక మిత్రుడు తన పోస్ట్ని షేర్ చేశారు. ఆ పోస్ట్ లో నళిని తన మనసులోని మాట చెప్పుకొచ్చారు. పూర్తిగా ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నట్లు ఫోటోలు పోస్టులు వీడియోలు కనపడ్డాయి. ఈమె డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు అయింది ఇంకా జనం గుర్తు పెట్టుకున్నారు చాలా సంతోషం అని నళిని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈమె ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకులుగా తపోమయ జీవితాన్ని గడుపుతున్నారు పూర్తి సాత్వికంగా మారిపోయారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆమె ఎవరిని కలవలేదు.

ఎప్పుడు తనకోసం తాను ఏమీ అడగలేదు. నా రాజీనామాని విత్ డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎప్పుడు ఇవ్వలేదు అని ఆమె ఈ పోస్ట్ లో రాశారు. ఉద్యోగాన్ని ఇప్పుడు ఇచ్చిన నేను పూర్తిగా న్యాయం చేయలేను. ఆర్థరైటిస్ వలన ఫిజికల్ ఫిట్నెస్ పోయింది అని చెప్పారు. త్యాగి నుండి యోగిని అయ్యి పతాంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదాన్ని యోగాలని ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోల్కున్నాను అని ఆమె చెప్పారు. బ్రాహ్మణత్వం నాలో ప్రవేశించిందని ఆమె ఈ పోస్ట్ లో రాసుకోవచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading