టీమిండియా మాజీ కెప్టెన్, అందరికీ రోల్ మోడల్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండియన్ క్రికెట్ లో ఎన్నో… మైలురాళ్లను దాటాడు విరాట్ కోహ్లీ దాటారు. మొదట్లో టీమిండియా కెప్టెన్ గా రాణించిన కోహ్లీ… కొన్ని అనివార్య కారణాల వల్ల కెప్టెన్సీకి దూరమయ్యాడు. ఇక ప్రస్తుతం మామూలు క్రికెట్ సభ్యుడిగా జట్టులో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ.
ప్రస్తుతం వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా తరఫున బాగా రాణిస్తున్నాడు విరాట్ కోహ్లీ. టీమిండియా ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో 5 మ్యాచ్లు ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదు మ్యాచ్లలో మొత్తం 354 పరుగులు చేసి… టాప్ మోస్ట్ క్రికెటర్ గా నిలిచాడు కోహ్లీ. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో ఒక సెంచరీ చేసిన కోహ్లీ… మొన్న న్యూజిలాండ్ పై సెంచరీ చేజార్చుకున్నాడు.
Advertisement
Advertisement
అయితే వరల్డ్ కప్ లో ఇంత బాగా రాణిస్తున్న కోహ్లీ డైట్ సీక్రెట్ బయటపడింది. ఈ విషయాన్ని టీమ్ ఇండియా దిగిన హోటల్ లోని ఎగ్జిక్యూటివ్ చెఫ్ అన్సుమన్ అనే వ్యక్తి బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ కార్బోహైడ్రేట్స్ తక్కువగా తింటాడని ఆయన వెల్లడించారు. కోహ్లీ ఒక వీగన్ అని చెప్పారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ చికెన్ మరియు మటన్ లాంటివి అస్సలు తినడని చెప్పుకొచ్చాడు. ఎక్కువ శాతం సోయా, డిమ్ సమ్స్, టోప్, మాక్ మీట్, లీన్ వంటి ప్రోటీన్ ఫుడ్ మాత్రమే కోహ్లీ తింటాడని అతడు చెప్పాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.