మనం ఏదైనా ఊరెళ్ళాలన్నా, ఇంట్లో ఎవరు లేకుండా బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా మొదట చేసే పని ఇంటికి తాళం వెయ్యడం. ఇంటికి తాళం వేసి కానీ, మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళము. అయితే.. మనం తాళం కప్పని ఎప్పుడు అంతగా గమనించి ఉండకపోవచ్చు. మనం ఎన్ని సార్లు తాళం వేసి తీసినా, హడావుడిలో పని అయ్యిందా లేదా అని చూస్తామే కానీ, తాళం కప్పని గమనించే అవసరం మనకి ఉండదు.
Advertisement
కానీ, కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది. మీరెప్పుడైనా గమనించారా? తాళం కప్పకి కింద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని మనం ఎప్పుడూ గమనించి ఉండము. కానీ, ఇవెందుకు ఉంటాయో తెలుసా? అవేమీ డిజైన్ కోసం పెట్టబడలేదు. ఇవి తాళం తీయడంలో కీలక పాత్రనే పోషిస్తాయి. ఈ హోల్స్ ను డ్రైన్ హోల్స్ అని పిలుస్తారట. తాళం ఇనుముతో తయారు అవుతుందన్న సంగతి మనకి తెలిసిందే. అయితే ఇనుము ఎక్కువ కాలం గాలికి ఎక్స్ పోజ్ అయితే తుప్పు పట్టిపోతుంది. తాళం కప్పు కూడా త్వరగా తుప్పు పట్టకుండా ఉండడానికి ఈ డ్రైన్ హోల్స్ ను డిజైన్ చేసారు. ఎప్పుడైనా ఈ కప్పు లోకి నీళ్లు పోతే.. ఈ డ్రైన్ హోల్స్ ద్వారా ఆ నీళ్లు బయటకు వచ్చేసి తాళం కప్పు తుప్పు పట్టకుండా చూస్తాయి.
Advertisement
మరొక కారణం ఏంటంటే, ఎప్పుడైనా తాళం కప్ప సరిగ్గా పడకపోతే ఈ డ్రైన్ హోల్స్ లో ఇంజిన్ ఆయిల్ లేదా మరేదైనా ఆయిల్ ను కొద్దిగా వేయండి. అయితే ఈ ఆయిల్ డ్రైన్ హోల్స్ నుంచి ఒక్క నిమిషం పాటు బయటకు రాకుండా చూసుకోండి. ఆ తరువాత నుంచి తాళం కప్ప సరిగ్గా పని చేస్తుంది. తాళం పట్టేయకుండా ఆయిల్ హెల్ప్ చేస్తుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
Adipurush: ఆదిపురుష్ చూడటానికి వచ్చిన హనుమాన్.. వీడియో వైరల్
రద్దయిన రూ.2 వేల నోట్లను..ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా?
10వ బ్యాట్స్ మెన్ గా వచ్చి.. సెంచరీలు చేసిన క్రికెటర్స్ వీరే..!