ఈ మధ్య కాలంలో పత్రికల్లో వచ్చే చాలా వార్తలు ఆధారాలు లేకుండా ఉంటున్నాయి. పత్రికల్లో వార్తల విషయంలో రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళే కాకుండా ప్రతీ ఒక్కరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద ఎన్నో తప్పుడు కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక గాసిప్స్ పేరుతో ప్రచురించే కథలు సినిమా, రాజకీయ, క్రికెట్ రంగాలను చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి.
Advertisement
ఇక తప్పుడు వార్తలు రాసే వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏంటీ అనేది స్పష్టత లేదు. అయితే అలాంటి వార్తలు రాసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం ఉంది. పత్రికలలో వచ్చే తప్పుడు వార్తలపై పిర్యాదు చేసే యంత్రాంగం ఏదైనా మన దేశం లో గానీ, రాష్ట్రం లో గాని ఉందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ చట్టం పేరు డిఫామేషన్ ఆక్ట్.
Advertisement
ఆ చట్టం కింద తప్పుడు వార్త రాసిన విలేకరిని, ఎడిటర్ను, యాజమాన్యాన్ని శిక్షించే వెసులుబాటు మనకు కల్పించారు. ఒక వేళ అది పరిస్కారం కాలేదంటే మాత్రం మరో మార్గం ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. వారికి సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేస్తే ఆ పత్రికకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. వార్త తీవ్రత ఆధారంగా చూస్తే పత్రిక గుర్తింపు రద్దు చేస్తుంది. ఈ తరహాలో మనకు చాలా కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి. కాని భయపడి వాటిని ఎవరూ వినియోగించుకునే ప్రయత్నం చేయడం లేదు.