సమ్మర్ వస్తుంది అంటే చాలు ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఏసీ విషయంలో ఎవరు ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా సరే ప్రజలు మాత్రం ఏసీ లేకుండా ఉండటం లేదు. కాస్త వాతావరణం వేడిగా ఉన్నా సరే ఏసీలోనే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఏసీతో నష్టాలు చాలానే ఉన్నాయి. ఆ నష్టాలు ఒకసారి చూస్తే…
Advertisement
శరీరానికి సాధారణ వేడిని కూడా తట్టుకొనే శక్తి శరీరం కోల్పోతుంది. చర్మం పొడి బారిపోయి తేమ కోల్పోవడంతో శరీరం ఫాస్ట్ గా ముడతలు పడుతుంది. సహజం గా వున్న రంగు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏసీలో ఎక్కువ సమయం ఉండటంతో కళ్ళు కూడా పొడిబారి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా ఫిల్టర్ శుభ్రం చేసుకోకపోవడంతో… గది లో వున్న సూక్ష్మ జీవులు పెరిగి శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Advertisement
శరీరం తేమ కోల్పోవడంతో ఇక ఎముకలు బోలుగా మారే అవకాశాలు ఉంటాయి. దీనితో చిన్న దెబ్బకు కూడా ఎముకలు విరిగే అవకాశం ఎక్కువ. ఏసీలో ఉన్నంత కాలం ఫ్రిడ్జ్ యాపిల్ మాదిరి ఉండి… బయటకు రాగానే నీళ్ళు కారినట్టు బయట వాతావరణం తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. టెంపరేచర్ నీ 26 లో సెట్ చేసుకుని, ఏసీ ఆపేసిన తర్వాత గాని… ఏసీ వేసే గంట ముందు గాని కిటికీలు ఓపెన్ చేసి ఉంచితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.