Home » స్టార్ హీరో కొడుకు వేధించాడంటూ వార్తలు.. స్పందించిన కృతి శెట్టి

స్టార్ హీరో కొడుకు వేధించాడంటూ వార్తలు.. స్పందించిన కృతి శెట్టి

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ… ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతోంది. ఉప్పెన సినిమా తర్వాత శ్యాంసింగారాయి, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం ఇక ఇటీవల కస్టడీ సినిమాతో కూడా అందరిని అలరించింది బ్యూటీ.

Advertisement

Advertisement

అయితే ఉప్పెన తర్వాత అంతటి హిట్… కృతి శెట్టి ఖాతాలో ఇప్పటివరకు పడలేదు. దీంతో కృతి శెట్టి ఐరన్ లెగ్ గా మారిపోతుందంటూ ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో గత వారం రోజులుగా కృతి శెట్టి చుట్టూ ఓ అంశం వివాదంగా మారిపోయింది. కృతి శెట్టిని ఓ స్టార్ హీరో కొడుకు తీవ్రంగా వేధిస్తున్నాడట. తనతో గడపాలని టార్చర్ చేస్తున్నాడట. తనతో క్లోజ్ గా ఉండకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు లేకుండా చేస్తానని ఆమెను హెచ్చరిస్తున్నాడట.

ఈ వార్త గత వారం రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇలాంటి తరుణంలో స్వయంగా హీరోయిన్ కృతి శెట్టి దీనిపై స్పందించింది. గత వారం రోజులుగా ప్రచారం జరుగుతున్న ఈ వార్తలలో అసలు నిజం లేదని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. తనను ఎవరూ టార్చర్ పెట్టలేదని… అర్థంపర్థం లేని మాటలు ఎందుకు ఇలా వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది హీరోయిన్ కృతి శెట్టి. గత వారం రోజులుగా తనపై ఇలాంటి వార్తలు రాసి… చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ బ్యూటీ.

Visitors Are Also Reading