Home » రైలు ప్రయాణికులకు హెచ్చరిక: పొరపాటున కూడా ఈ వస్తువులు తీసుకెళ్లరాదు..!!

రైలు ప్రయాణికులకు హెచ్చరిక: పొరపాటున కూడా ఈ వస్తువులు తీసుకెళ్లరాదు..!!

by Sravanthi
Ad

చాలామంది రైల్లో ప్రయాణించే సమయంలో రకరకాల లగేజీని తీసుకు వెళ్తుంటారు. ఒక్కోసారి లగేజ్ ఎక్కువగా కనిపిస్తే TTE జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. అయితే రైలు లో ప్రయాణించిన సమయంలో కొన్ని రకాల వస్తువులను రైల్వే సంస్థ నిషేధించింది. ఈ వస్తువులు రైల్లో ప్రయాణించే సమయంలో పట్టుకుపోతే కేసులతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని తెలియజేస్తోంది. ఇంతకీ ఆ వస్తువులేంటో చూద్దాం..
గ్యాస్ సిలిండర్:

also read;62 వెడ్స్ 21…ముస‌లాడే కానీ మ‌హానుభావుడు..!

Advertisement

కొంతమంది వివిధ ప్రాంతాలకు ఉద్యోగరీత్యా లేదంటే ఏదైనా పని కోసం కుటుంబంతో సహా వెళ్తున్న సమయంలో ఇంట్లోని వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టవ్ లు,గ్యాస్ సిలిండర్లు కూడా తీసుకువస్తుంటారు. అయితే రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ సిలిండర్లు,స్టవ్వులను తీసుకెళ్లడం రైల్వే చట్టం ప్రకారం చట్ట విరుద్ధమట. రైల్వే సంస్థ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత ఖాళీ సిలిండర్లు తీసుకెళ్లొచ్చు. నింపిన సిలిండర్ తీసుకెళ్తే కఠినమైన శిక్షలు ఉంటాయి.
యాసిడ్ బాటిల్స్ :

Advertisement


రైలు ప్రయాణంలో మనతో యాసిడ్ బాటిల్ తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ఈ బాటిల్ తో ప్రయాణికుడు పట్టుబడితే సెక్షన్ 164 ప్రకారం జైలు శిక్షతోపాటుగా వేయి రూపాయల జరిమానా విధిస్తారట.
క్రాకర్స్:


రైలు ప్రయాణాల్లో క్రాకర్స్ తీసుకెళ్లడం నిషేధం. పటాకులు తీసుకెళ్లడం వల్ల రైళ్లలో మంటలు చెలరేగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఇవి తీసుకెళ్తే జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా ఉంటాయట.

also read;తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. వాళ్లకు ఈవెంట్స్‌ లేవు.. డైరెక్ట్‌గా మెయిన్సే

Visitors Are Also Reading