Home » సినిమా సరిగ్గా తీయ్యకుంటే ఛస్తావ్ అంటూ ఉత్తరాలతో బెదిరించింది ఆ స్టార్ హీరో ఫాన్స్ ?

సినిమా సరిగ్గా తీయ్యకుంటే ఛస్తావ్ అంటూ ఉత్తరాలతో బెదిరించింది ఆ స్టార్ హీరో ఫాన్స్ ?

by AJAY
Ad

సినిమా హీరోలను అభిమానులు ఏ రేంజ్ లో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంటారు. తమ హీరో సినిమా హిట్ అయితే ఎంత సంతోషపడతారో ఫ్లాప్ అయితే అంతే బాధపడతారు కూడా. ఇక కొందరు అభిమానులు అయితే తమ హీరో కోసం సోషల్ మీడియాలో గొడవలకు సిద్ధపడుతుంటారు.

Advertisement

అంతేకాకుండా తమ ఫేవరెట్ హీరో సినిమాను సరిగ్గా తీయకపోతే బాగుండ‌దు అంటూ ఈ మ‌ధ్య‌కాలంలో ట్విట్టర్ లో దర్శకులకు వార్నింగ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి లెటర్లు రాసి మరీ దర్శకులకు అభిమానులు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అనుభవమే ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యకు సైతం ఎదురయ్యిందట‌.

Advertisement

ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. మెగాస్టార్ చిరంజీవి బాస్ బోస్, ముఠామేస్త్రి, రిక్షావోడు లాంటి వ‌రుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ సినిమాను అనుకున్నారు. ఈ సినిమాకు ఎడిట‌ర్ మోహన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక వరుస ఫ్లాప్ ల‌తో చిరంజీవి ఉండటంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. దాంతో ఓ అభిమాని వార్నింగ్ ఇస్తూ ముత్యాల సుబ్బయ్యకు లేఖ రాశారట.

నువ్వు చేస్తుంది మా బాస్ తో సినిమా. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని షూటింగ్ చేయి. చిరంజీవిని తెర పైన భాగా చూపించాలి అంటూ ఉత్తరాలు రాశారట. దాంతో ముత్యాల సుబ్బయ్య భయపడ్డారట. కానీ ఆ తర్వాత తాను చేయాల్సిన పని చేశారట. ఇక అలా తెర‌కెక్కిన హిట్ల‌ర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మెగాస్టార్ అభిమానులు పండగ చేసుకున్నారు. అంతే కాకుండా చిరంజీవి సైతం ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

Visitors Are Also Reading