ప్రస్తుతం చాలామంది వారి కెరియర్ దృష్ట్యా ప్రతిరోజు వర్క్ వర్క్ వర్క్ అంటూ పరిగెడుతూ ఉంటారు.. ఏదో ఒకటి రెండు రోజులు సెలవు దొరికితే ఎక్కడికి వెళ్లాలో ఎలా ఎంజాయ్ చెయ్యాలో అర్థం కాక టైమంతా వేస్ట్ చేస్తుంటారు.. అలాంటి వారు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అంటే ఈ ప్రదేశాలను ఎంచుకోండి.. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
కీసర గుట్ట:
Advertisement
ఇది చాలా పవిత్రమైన స్థలం ప్రశాంతత కోసం వెతుకుతున్న ప్రజలకు అనువైనది. శివ భక్తులకు ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ అభయారణ్యంలో శివలింగం ఉంటుంది. అభయారణ్యం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.హైదరాబాద్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
రాచకొండ కోట:
రాచకొండ కోట 14 వ శతాబ్దపు పద్మనాయక పాలకుడైన అనపోతనాయకుడు పనిచేసిన కోట.ఈ కోటను చూస్తే కాకతీయ పనితనం, అద్భుతమైన కళాఖండాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మీ కళ్లకు స్పష్టంగా నచ్చుతాయి.
యాదగిరిగుట్ట:
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ప్రసిద్ధి. ఇది హైదరాబాద్ నగరం నుండి దూరం ఏమి కాదు. ఇక్కడ ప్రశాంతమైన పరిసరాలు, ఏడాది పొడవునా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. హైదరాబాద్ నుండి 62 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అనంతగిరి కొండలు:
లాంగ్ స్ట్రెచ్ డ్రైవ్ అంటే ఇష్టం లేని పక్షంలో, మీ ఇంటికి దగ్గరలో ఉన్నవి అనంతగిరి హిల్స్. ఆకర్షణీయమైన సరస్సు, అద్భుతమైన అభయారణ్యాలు, ప్రకృతి రమణీయతను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
హైదరాబాద్ నుండి 81 కిలో మీటర్ల దూరం ఉంటుంది.
నల్గొండ:
Advertisement
ALSO READ;CHANAKYA NITI : ఈ ఐదుగురిని నిద్ర లేపారంటే ప్రాణాలు పోయే అవకాశం…
ఈ ప్రదేశాన్ని చాళుక్యులు, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు వంటి పురాతన రాజులకు కేంద్రంగా ఉండేది. మధ్యయుగ కాలంలో బహమనీ సుల్తానులు ఈ ప్రదేశాన్ని పాలించేవారు. ఫలితంగా, ఈ ప్రదేశం పెద్ద మొత్తంలో పాత నిర్మాణ కట్టడాలను కలిగి ఉంది. ఈ ప్రదేశంలో అద్భుతమైన అభయారణ్యాలు, మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.
హైదరాబాద్ నుండి దూరం 100 కి.మీ దూరంలో ఉంది.
వరంగల్:
కాకతీయులు పాలించిన ఈ నగరంలో అద్భుతమైన కోటలు, వేయి స్తంభాల గుడి, రామప్ప, ఇతర అభయారణ్యాలు, భద్రకాళి టెంపుల్ ఈ కట్టడంలో చూసినా శివలింగం దర్శనమివ్వడం వంటివి ఈ ప్రాంతానికి పెట్టింది పేరు. హైదరాబాదు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
వేములవాడ :
హైదరాబాద్ నుండి వన్ రోడ్ ట్రిప్ లో ఉండే మరొక ప్రముఖ స్థానం వేములవాడ. ఇక్కడ శివుని గుడి చాలా ప్రత్యేకం. వందల ఏళ్ళ నాటి కోటలు కట్టడాలు కూడా కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి 155 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ALSO READ;
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అస్సలు చెయ్యకూడని పూజలు ! తప్పక తెలుసుకోండి !