Home » డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్…. ఎందుకంటే….??

డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్…. ఎందుకంటే….??

by Bunty
Ad

 

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ ని వినియోగిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ ని చూడకుండా ఉండరు. అలాగే పడుకునే ముందు కూడా ఫోన్ ని చూసే పడుకునేవారు చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే తాజాగా వివో కంపెనీ స్విచ్ ఆఫ్ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. తమ కస్టమర్లు అందరూ డిసెంబర్ 20వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ ఫోన్ లో స్విచ్ ఆఫ్ చేసి ఒక గంట సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడపాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement

Advertisement

తల్లిదండ్రులు, పిల్లలు ఒక గంటపాటు సంతోషంగా గడపాలని కోరుకుంటుంది. తాజాగా జరిగిన సర్వే ప్రకారం…. పిల్లలు విపరీతంగా సెల్ ఫోన్లు వాడుతున్నారని, తల్లిదండ్రులు కూడా అంతే స్థాయిలో ఫోన్ ని వినియోగిస్తున్నారని వెళ్లడయింది. దీనివల్ల తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అల్లరి చేస్తున్నారని, అన్నం తినడం లేదని సెల్ ఫోన్ ని అలవాటు చేస్తూ ఉంటారు.

ఇది చాలా సరదాగా ప్రారంభమై అదొక పెద్ద వ్యసనంగా మారుతుంది. దాదాపు 69 శాతం మంది పిల్లలకు సొంతంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు ఉన్నాయి. చాలామంది పిల్లలు ఫోన్ ని వీడియోలు చూడడం కోసం, గేమ్ లు ఆడడంకోసం వినియోగిస్తున్నారని సర్వేలో వెళ్లడైంది. ఇక అందుకోసమే వివో సంస్థ కనీసం ఒక గంట పాటు ఫోన్ ని ఆఫ్ చేసి కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని విజ్ఞప్తి చేస్తోంది.

Visitors Are Also Reading