Home » దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్న పదం వచ్చినట్టే ఆ పదం కూడా వచ్చింది : విశ్వక్ సేన్

దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్న పదం వచ్చినట్టే ఆ పదం కూడా వచ్చింది : విశ్వక్ సేన్

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ చేసిన ఓ పని వార్తల్లో హెడ్లైన్ గా మారింది. విశ్వక్ సేన్ ఓ వ్యక్తితో కలిసి ప్రాంక్ వీడియో చేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిన ప్రాంక్ లో యువకుడు పెట్రోల్ పోసుకుని తగల పెట్టుకుంటా అని బెదిరింపులకు పాల్పడ్డాడు.

Advertisement

Advertisement

ఈ ప్రాంక్ ను రోడ్డు పై చిత్రించారు. దాంతో ఓ న్యాయవాది హెచ్ ఆర్ సీ లో ఫిర్యాదు చేశాడు.దాంతో ఓ టివి ఛానల్ లో దీని గురించి డిబేట్ జరిగింది. ఈ డిబేట్ లో విశ్వక్ సేన్ యాంకర్ దేవి నాగవల్లి మధ్య గొడవ జరిగింది. గొడవలో వ్విశ్వక్ సేన్ ఎఫ్ పదం ఉపయోగిస్తూ పచ్చి బూతు మాట్లాడాడు.

vishweksen

vishweksen

దాంతో నెటిజన్స్ విశ్వక్ సేన్ అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదు అంటూ తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో నే విశ్వక్ సేన్ తాజా ఇంర్వ్యూలో..దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్న పదం వచ్చినట్టే ఆ పదం వచ్చింది అన్నాడు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆ పదం వాడుతున్నారు అంటూ కామెంట్స్ చేశాడు. కానీ మీడియా ముందు మాట్లాడి ఉండకూడదు అంటూ సారీ చెప్పాడు.

Visitors Are Also Reading