కేంద్రంలోని మోడీ సర్కార్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే రాజ్యాంగంలో అనేక మార్పులు చేసిన మోడీ సర్కార్… ఇప్పుడు ఇండియా పేరునే మార్చేసే దిశగా పని చేస్తోంది. త్వరలోనే ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు మోడీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే g7 సమ్మిట్ లో భారత్ అని ముద్రించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఆ కూటమి కి ఇండియా పేరును ఫైనల్ చేశారు విపక్ష నేతలు. అయితే కూటమి నిర్ణయం నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియా పేరును భారత్ గా మార్చబోతుందని విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తుందని… ఆ సమావేశాలలోనే భారత్ గా పేరు మార్చబోతుందని తెలుస్తోంది. ఈ తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో… టీమిండియా ఆటగాళ్లు..భారత్ అని రాసి ఉన్న జెర్సీలతో క్రికెట్ ఆడాలని ఆయన సూచించారు. ఈ మేరకు బీసిసిఐ కార్యదర్శి అమిత్ షా కొడుకు జై షా కు విజ్ఞప్తి చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
Advertisement
Advertisement
ప్రధాని మోడీ ప్రభుత్వం… ఇండియా పేరు మార్చడం చాలా మంచి పని అని పేర్కొన్న వీరేంద్ర సెహ్వాగ్… మోడీ ప్రభుత్వానికి తన మద్దతును తెలిపారు. ఈ నిర్ణయంతో ఇండియన్ గా గర్విస్తున్న అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మన ఇండియాలోనే జరగనుంది. ఈ మేరకు ఇవాళ 15 మంది సభ్యులతో టీమిండియా జట్టును కూడా బీసీసీఐ పాలకమండలి ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండగా… వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కు ఛాన్స్ ఇచ్చారు.