ఆస్ట్రేలియా-ఇండియా మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన సూపర్ సెంచరీతో క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్ మన్ వంటి దిగ్గజాల తర్వాతి స్థానం తన సొంతం చేసుకున్నాడు. కోహ్లీ దాదాపు మూడేళ్ల పాటు సాగిన టీమిండియా అభిమానుల నిరీక్షణకు టీమిండియా కింగ్ కోహ్లీ ముగింపు పలికాడు.
Advertisement
ఎప్పుడో 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్ పై టెస్ట్ సెంచరీ బాదిన కోహ్లీ, మళ్లీ ఈరోజు మళ్లీ ఆ ఫీట్ ను అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో మెరిశాడు. ఫలితంగా సెంచరీ కోసం సాగిన 1205 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు కోహ్లీ ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే విరాట్ కోహ్లీకి ఇది 28వ టెస్టు సెంచరీ కావడం విశేషం.
Advertisement
ఓవరాల్ గా కింగ్ కోహ్లీ కెరీర్ లో ఇది 75వ సెంచరీ. టెస్టుల్లో 28, వన్డేలో 46, టీ20లో 1 సెంచరీని విరాట్ బాదాడు. ఇక ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించారు. అదేమిటంటే, ఆస్ట్రేలియాపై మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీకి ఏది 16వ సెంచరీ. ఇందులో 8 సెంచరీలు టెస్టుల్లోనే చేశాడు. ఈ క్రమంలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్ గా కోహ్లీ అవతరించారు. తద్వారా క్రికెట్ లో ఎవర్ గ్రీన్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, సర్ డాన్ బ్రాడ్ మన్ సరసన విరాట్ కోహ్లీ చేరాడు.