ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఎంతో మంది ఆఫ్గన్ ప్రజలు దేశం వదిలి వెళ్లడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వేలమంది విమానాశ్రయాలకు వెళ్లి విమానాల వెంట పరుగులు తీశారు. కొందరు అయితే ఏకంగా విమానం టైర్లను పట్టకుని వేళాడుతూ గాళ్లో నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్ల రాజ్యంలో బ్రతకలేం అంటూ చాలా మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు ఏడ్చారు. అయితే తాలిబన్ల రాజ్యంలో కొన్ని మంచిపనులు కూడా ఉన్నాయని తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే తెలుస్తుంది.
Advertisement
Advertisement
వీడియోలో ట్యాంకుల్లో ఉన్న మద్యాన్ని కింద పడవేస్తున్నారు. దాదాపు ఆ మద్యం మూడు వేల లీటర్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ఘటన ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో చోటు చేసుకుంది. కాబూల్ లో ఇంటిలిజెన్స్ ఏజెంట్ లు మూడు వేల లీటర్ల మద్యాన్ని కింద పడవేశారు. ఈ వీడియోను జనరల్ డైరెక్టరేజ్ ఆఫ్ ఇంటిలిజెన్స్ షేర్ చేసింది. వీడియోలో ఇంటిలిజెన్స్ ఏజెంట్లు మద్యాన్ని కాలువలో పడవేశారు.
ఈ సంధర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ..ముస్లీంలు మద్యం చేవించడం మరియు అమ్మడానికి దూరంగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా పలు చోట్ల తనికీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తాజాగా జరిపిన దాడుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఇక తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరవాత మద్యం అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా డ్రగ్స్ పై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు.