ఓ సినిమాలో హీరో హీరోయిన్ ల తరవాత మళ్లీ అంతటి క్రేజ్ విలన్ కే ఉంటుంది. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం కూడా అంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. హీరో పాత్ర కచ్చితంగా విలన్ ను ఢీ కొట్టే రేంజ్ లో ఉండాలి. ఇక ఒకప్పటి నుండి ఇప్పటి వరకూ చాలా మంది విలన్ లు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వారిలో నటుడు బాలాజీ కూడా ఒకరు. బాలాజీ చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కానీ ఒకప్పుడు ఆయన చిరంజీవి సినిమాలోనూ ముఖ్యమైన పాత్రలో నటించాడు.
Advertisement
బాలాజీ మగమహారాజు సినిమాలో చిరంజీవికి తమ్ముడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో తన నటనతో మెప్పించాడు. ఆ తరవాత చాలా సినిమాలలో ఆఫర్ లు అందుకున్నాడు. ఈ సినిమా తరవాత మంగమ్మగారి మనవడు, మహానగరంలో మాయగాడు లాంటి సినిమాలలోనూ నటించాడు. ఇదిలా ఉంటే బాలాజీ అక్కా బావ కూడా మనకు బాగా తెలిసిన నటీనటులు అన్న సంగతి చాలా మందికి తెలియదు.
Advertisement
బాలాజీ అక్క రోహిణి ఎవరో కాదు సినిమాల్లో తల్లి, అక్క లాంటి పాత్రలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా చాలా మంది హీరోయిన్ లకు రోహిణి డబ్బింగ్ చెప్పి తన వాయిస్ తో మెప్పించింది. రోహిణి భర్త ఒకప్పటి స్టార్ విలన్ రఘవరున్…ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే.
రఘువరున్ ప్రస్తుతం మన మధ్యన లేకపోయినా ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన విలన్స్ లో ఒకరు. స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలలో రఘువరున్ ముఖ్యమైన పాత్రలలో నటించాడు. రఘువరున్ 1996 సంవత్సరంలో రోహిణిని వివాహం చేసుకున్నాడు. అలా బాలీజీకి రఘువరున్ భావ అయ్యాడు.