మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. అయితే ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో ఎవరి పాత్రకు ప్రాధాన్యత తక్కువైనా ఫ్యాన్స్ ఒప్పుకోరు.
Advertisement
కానీ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చూస్తుంటే ఎన్టీఆర్ పాత్ర కంటే చరణ్ పాత్రకు కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందనే అనుమానాలు మొదలవుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో తాను రామ్ చరణ్ కే రెండు మార్కులు ఎక్కువ వేస్తాను అని చెప్పడం కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.
Advertisement
ఎన్టీఆర్ చరణ్ లలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు అంటూ యాంకర్ విజయేంద్రప్రాసాద్ ను ప్రశ్నించాడు. దానికి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ….అడవితల్లి బిడ్డ కావడం వల్లనేమో ఎన్టీఆర్ పాత్ర నాకు నచ్చింది. అడవిపూవులా ఆ పాత్ర తెరపై స్వచ్చంగా కనిపిస్తుంది. ఆ పాత్రలో ఎన్టీఆర్ గొప్పగా చేశాడు. చరణ్ విషయానికి వస్తే ఓవైపు పోరాటం మరోవైపు సంఘర్షణను అనుభవించే పాత్రలో కనిపిస్తాడు. అల్లూరి పాత్ర వేరియేషన్స్ లో లేయర్స్ ఎక్కువగా ఉంటాయి.
ఆ పాత్రను పోశించడం కష్టం…సినిమాలో చరణ్ ను ఎన్టీఆర్ అన్నా అని పిలుస్తాడు. అంటే రామ్ చరణ్ పాత్ర పరిణతి ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం కానీ ఈ సినిమాకు చరణ్ కే రెండు మార్కులు ఎక్కువ వేస్తాను..అంటూ విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక విజయేంద్రప్రసాద్ కామెంట్స్ చూస్తుంటే చరణ్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అర్థం అవుతోంది. ఒకవేళ రేపు సినిమా చూసాక అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.