భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజైన చిరంజీవి 152 చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీలో రామ్ చరణ్ మరియు చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపించారు. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచే డిజాస్టర్ టాక్ ను మోసుకు వస్తుంది. మూవీ ఏమాత్రం కూడా ప్రేక్షకులని ఆకట్టుకోలేదు అని, ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేదని టాక్ వచ్చింది.
Advertisement
Advertisement
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే చాలా పూర్ గా ఉందని, మూవీ ప్రపంచం మొత్తంలో రెండు వేల పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం చేతులెత్తేసింది అని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు మరియు మూడవ రోజు బాక్సాఫీసు దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా నిరాశ పరిచింది. అయితే ఈ మూవీ యొక్క నైజాం హక్కులను వరంగల్ శీను 39 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఈ యొక్క ఫ్లాప్ టాక్ తో మూవీ నైజాం లోనే దాదాపు 25 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని దీంతో వరంగల్ కు ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆయన దీంతో ఎలాంటి డిస్కౌంట్ కూడా పొందలేదు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ నైజాం హక్కుల కొరకు వరంగల్ శ్రీను అగ్రిమెంట్ చేయబోతున్నారని సమాచారం. ఈ లైగర్ సినిమా అయినా వర్కౌట్ అయితే కొంత నష్టాలను రికవరీ చేయవచ్చని అనుకుంటున్నారు. ఆచార్య మూవీ తో వరంగల్ శీను మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టపోయారు . సినిమా విడుదలైన కొన్ని ప్రాంతాల్లో ఊహించినదానికంటే మరీ ఎక్కువ డిజాస్టర్ అయింది.
ALSO READ :
సమంత ఇంట్లో 6 లగ్జరీ కార్లు..ఒక్కో కారు ధర ఎంతో తెలుసా..!
చిరు చేసిన ఆ పని వల్లే సినిమా పరాజయాన్ని మూటకట్టుకుందా.. ? కొరటాల తప్పు లేదా. ?