వైఎస్ఆర్సిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి కాంగ్రెస్ ని విమర్శించారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటరీ సంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి హేతుబద్ధత లేకుండా శాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ ఏపీ ప్రజలు క్షమించరని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో పొందపరిచి పార్లమెంట్ ఆమోదం పొందినట్లయితే ఆంధ్రప్రదేశ్ కి హోదా చట్టబద్ధంగా లభించి ఉండేదని చెప్పారు.
Advertisement
Advertisement
ప్రత్యేక హోదా అంశాన్ని ప్రణాళిక సంఘానికి పంపించడం వలనే హోదా అంశం చట్టబద్ధతని కోల్పోయిందని అన్నారు. 2004 నుండి 2014 దాకా సాగిన కాంగ్రెస్ దుష్పరిపాలన తో పోల్చుకుంటే భారత్ సాధించిన గణనీయమైన ప్రగతి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పుకోదగ్గ విశేషంగా అభివర్ణించారు. చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్ దేశ ప్రజల్ని వంచించలేదు అని అన్నారు. కాంగ్రెస్ దుష్పరిపాలనికి అతిపెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. హేతుబద్ధత లేకుండా శాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక సామాజిక వ్యవస్థని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది అని అన్నారు విజయసాయిరెడ్డి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!