టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. సింగిల్స్ గా ఉన్న ప్రతి ఒక్కరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే గత నాలుగేళ్ల నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మీద ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రంతోనే వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటి నుంచే వీరిపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.
Advertisement
వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, వెకేషన్స్ కి వెళ్తున్నారంటూ, త్వరలోనే వివాహం కూడా చేసుకుంటారంటూ ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. వీరు కూడా ప్రేక్షకులకు డౌట్స్ వచ్చేలా ఇద్దరు సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫొటోస్ పోస్ట్ చేయడం, వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేయడం వంటివి చేస్తూ ఉండడం వల్ల వీరిపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా దీపావళి పండుగ జరిగింది. ప్రతి ఒక్కరు ఈ పండుగను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సెలబ్రెటీల గురించి అయితే చెప్పనవసరం లేదు.
Advertisement
ఈ క్రమంలోనే విజయ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్ కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా రష్మిక కూడా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రష్మిక…. విజయ్ దేవరకొండ ఇంట్లో ఉన్నట్టు బ్యాగ్రౌండ్ ఉండడంతో ప్రేక్షకులు మళ్లీ ఆలోచనలో పడ్డారు. అత్తారింట్లో రష్మిక దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుందంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక ఈ వార్తల్లో ఇంతవరకు నిజం ఉందో వారు చెప్పేవరకు తెలియదు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!