Home » గోపీచంద్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? 9ఏళ్ల వయసులో ఉండగానే తండ్రి…ఆ తర్వాత అన్న…!

గోపీచంద్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? 9ఏళ్ల వయసులో ఉండగానే తండ్రి…ఆ తర్వాత అన్న…!

by AJAY
Ad

టాలీవుడ్ లో మ్యాచో మ్యాన్ గోపీచంద్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చూడ్డానికి ఆరడుగుల బుల్లెట్ లా కనిపించే గోపీచంద్ నటనను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. రీసెంట్ గా గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గోపీచంద్ కు కమర్షియల్ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇక సినిమాల్లో ఎంతో సక్సెస్ అయినా గోపీచంద్ రియల్ లైఫ్ లో మాత్రం ఎంతో విషాదాన్ని చూడాల్సి వచ్చింది.

Advertisement

గోపీచంద్ తండ్రి టి.కృష్ణ ప్రముఖ దర్శకుడు అన్న విషయం చాలామందికి తెలియదు. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏడాది పాటు థియేటర్లలో ఆడింది. విజయశాంతితో కూడా టి కృష్ణ కొన్ని సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలతోనే విజయశాంతి లేడీ అమితాబ్ గా పేరు సంపాదించుకుంది.

Advertisement

అయితే టీ. కృష్ణ చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి కన్నుమూయాల్సి వచ్చింది. ఆ సమయంలో గోపీచంద్ వయసు కేవలం 9 సంవత్సరాలేనట. ఇక అంతకుముందు కూడా గోపీచంద్ చదువు కోసం తండ్రికి దూరంగా ఉండాల్సి వచ్చిందట. దాంతో తండ్రితో సరిగా అనుబంధం ఏర్పడకముందే ఆయన దూరమయ్యారంటూ గోపీచంద్ అనేక సందర్భాల్లో బాధపడ్డారు. ఇక గోపీచంద్ అన్నయ్య ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు.

కానీ ఆయన కూడా చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే అప్పటివరకు గోపీచంద్ బిజినెస్ చేయాలని అనుకున్నారు. కానీ తన తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీ లోకి రావాలని… అన్నయ్య కూడా లేడని సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత జయం సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు అందుకుంటున్నారు.

Visitors Are Also Reading