Home » రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి! మొదటి సారి పాజిటివ్ గా!

రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి! మొదటి సారి పాజిటివ్ గా!

by Srilakshmi Bharathi
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా కోడలు ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి… హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి ఉపాసనను మెగా కుటుంబం తరలించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం అంటే జూన్ 20వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

venuswamy

Advertisement

ఈరోజు ఉదయం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక మెగా ఫ్యామిలీ లో సంతోషం మాములుగా లేదు. కాసేపటికి క్రితమే అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహతో కలిసి అపోలోకి వెళ్లి బేబీని చూసి వచ్చారట. ఇక ఫ్యాన్స్ సంతోషం కూడా మాములుగా లేదు. ఈ గుడ్ న్యూస్ కి తోడు సెలెబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మరో శుభవార్తని కూడా చెప్పారు. మెగా వారసురాలి జాతకం గురించి ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

cherry

ఆ చిన్నారి భవిష్యత్ లో తాత, తండ్రిని మించిన స్థాయికి వెళ్తుందని, కొణిదెల వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందని చెప్పారు. పాప జన్మ నక్షత్రం పునర్వసు, రామ్ చరణ్ ది రోహిణి అయితే ఉపాసనది కృత్తికా నక్షత్రం. ఈ ముగ్గురిదీ దైవిక అంశ కలిగిన నక్షత్రమని పేర్కొన్నారు. పాప పుట్టిన సమయం కూడా అద్భుతంగా ఉందని, తాతకి, తండ్రికి కలిసి వస్తుందన్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

ఈ హీరోలు ఇంకా పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాలు ఇవే…!

50 ఏళ్ల వయసు వచ్చినా కూడా యంగ్ గా కనిపిస్తున్న హీరోలు!

Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

Visitors Are Also Reading