Home » టీమిండియా ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్… మూడో టెస్ట్ వేదికలో కీలక మార్పు…కారణమేంటంటే?

టీమిండియా ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్… మూడో టెస్ట్ వేదికలో కీలక మార్పు…కారణమేంటంటే?

by Bunty
Ad

 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. నాగపూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అశ్విన్ జడేజా అదరగొట్టారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా… 4 టెస్టుల సిరీస్‌ లో 1-0 తేడాతో ముందజలోకి వచ్చింది.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా, మొదటి టెస్ట్‌ గెలిచిన సంతోషంలో ఉన్న టీమిండియా ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్. భారత్, ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో మూడో టెస్ట్ మ్యాచ్ జరగదని బీసీసీఐ సోమవారం స్పష్టం చేసింది. మార్చి ఒకటి నుంచి ఐదు వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ ధర్మశాల నుంచి ఇండోర్ కు మార్చారు. ఈ మేరకు బీసీసీఐ ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. ధర్మశాలలో మూడో టెస్ట్ జరగదని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా బీసిసిఐ కూడా ఈ వార్తను ధృవీకరించింది. బీసీసీఐ క్యూరేటర్ తపోష్ చటర్జి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంను సందర్శించి పిచ్, అవుట్ ఫీల్డ్ ను పరిశీలించారు. బోర్డుకు నివేదిక సమర్పించకపోవడంతో, మరసటి రోజే నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సిరీస్ లోని రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలో, చివరి మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది.

READ ALSO : Prabhas To PK : 2023లో అత్యధిక పారితోషికం పొందుతున్న 8 మంది తెలుగు హీరోలు

Visitors Are Also Reading