వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిపోయారు. తాజాగా, ప్రభాస్ ఆరోగ్యం గురించి వేణు స్వామి చెప్పిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ప్రభాస్ ఆరోగ్యం గురించి ఆయన చెప్పుకొచ్చారు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫేమస్ అయిపోయారు. గతంలో చెప్పినవి చెప్పినట్లు జరగడం వలన ఆయనని ఎక్కువమంది ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. సమంత నాగచైతన్యలు వివాహక జీవితం అంత సాఫీగా సాగదని ఆయన చెప్పినప్పటినుండి కూడా పాపులర్ అయిపోయారు.
Advertisement
ప్రభాస్ విషయంలో వేణు స్వామి మొదటి నుండి కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ప్రభాస్ ఆది పురుష సినిమా ముందే ఫ్లాప్ అవుతుందని చెప్పేసారు. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. సెలబ్రిటీలు కూడా ఆయన దగ్గరకు వెళ్లి పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. సలార్ సినిమా విషయంలో వేణు స్వామి లెక్కలు మాత్రం తప్పాయి. తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని చెప్పారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.
Advertisement
వేణు స్వామి సలార్ సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారు ప్రభాస్ కి ఇప్పట్లో హిట్ దొరకడం కష్టమని కూడా చెప్పారు. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిపోయింది దీంతో వేణు స్వామిని టార్గెట్ చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు ఆ తర్వాత వేణు స్వామి మరో బాంబుని పేల్చారు సలార్ సినిమా ప్రమోషన్స్ కి రాలేదని, ప్రభాస్ కి పెద్ద సర్జరీ జరిగిందని చెప్పారు. సలార్ షూటింగ్ తర్వాత ప్రభాస్ మూడు నెలలు ఇండియాలోనే లేరట. సర్జరీ కోసం విదేశాలకు వెళ్ళాడని, వేణు స్వామి అన్నారు సలార్ ప్రమోషన్స్ కి రాకపోవడానికి కూడా అదే కారణం అన్నారు మీడియా కి కూడా సర్జరీ జరిగినట్లు చెప్పకుండా జాగ్రత్త పడ్డారని వేణు స్వామి ఆయన ఆరోగ్య గురించి కామెంట్స్ చేశారు