భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్భంగా వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశ సంస్కృతి మరియు వారసత్వం గొప్పవని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారత దేశ ఎదుగుదలను చూసి పాశ్చ్యాత్య దేశాలకు అసూయ కలుగుతోంది అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన హుందాగా ఉండాంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
సాంఘీక వివక్ష చూపకూడదు అంటూ వెంకయ్య నాయుడు ఆసక్తికవర వ్యాఖ్యలు చేశారు. సాంఘీక వివక్ష చూపకూడదని అందరూ ప్రతిజ్ఞ చేయాలంటూ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కులం కంటే గుణం మిన్న అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని తెలిపారు. మన ఉనికిని కాపాడుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నించాలని చెప్పారు. మాతృభాషలోనే మాట్లాడాలని నియమం పెట్టుకోవాలన్నారు. అమ్మ భాష రాకుంటే అంతకు మించి అవమానం లేదని అన్నారు.