Home » వాస్తు: భార్యాభర్తల మధ్య, కుటుంబంలో గొడవలు రాకుండా ఉండాలంటే.. ఇవి ఖచ్చితంగా చేయండి..!

వాస్తు: భార్యాభర్తల మధ్య, కుటుంబంలో గొడవలు రాకుండా ఉండాలంటే.. ఇవి ఖచ్చితంగా చేయండి..!

by Sravya
Ad

పెళ్లి తర్వాత భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అలానే కుటుంబ సభ్యులతో కూడా బాగా ఉండాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం భార్య భర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఇవి పాటించడం చాలా అవసరం. బెడ్రూంలో అద్దం ఉంటే భర్త లేదా భార్య నిద్రిస్తున్నప్పుడు ప్రతిబింబం అద్దంలో కనపడకూడదు అలా కనిపించిన చోట అద్దం ఉంచడం వలన భార్యాభర్తల మధ్య సంబంధం పాడవుతుంది. అద్దాన్ని మార్చడం వీలు కాకపోతే నిద్రపోయేటప్పుడు ఏదైనా వస్త్రంతో అద్దాన్ని కవర్ చేయడం మంచిది బెడ్రూంలో ఎప్పుడూ లైట్ కలర్స్ ఉండాలి. లైట్ కలర్స్ ఉండడం వలన అనుకూలమైన ప్రశాంతమైన సామరస్య వాతావరణం కలుగుతుంది. ఇంట్లో పచ్చని మొక్కలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Advertisement

Advertisement

కుటుంబ సంబంధాలకి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది అలానే వివాహిత జంటలు సౌత్ ఈస్ట్ కి ఎదురుగా ఉన్న గదిలో ఉండకూడదు. ఇంటిని ఎప్పుడూ కూడా అందంగా ఉంచుకోవాలి. అందంగా అలంకరించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇంటిని చాలా అందంగా మార్చుకోండి. అలానే బెడ్ రూమ్ తలుపులు మూసి ఉంచడం మంచిది. నిద్రపోయేటప్పుడు కచ్చితంగా క్లోజ్ చేసుకోండి. అప్పుడు ప్రశాంతత పెరుగుతుంది. భార్య భర్తల మధ్య సంబంధం బాగుండాలంటే భార్యలు మంచానికి ఎడమవైపు భర్తలు కుడి వైపు పడుకోవాలి. మంచం మీద కూర్చుని భోజనం చేయడం మంచిది కాదు. ఇలా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading