Home » Vastu Tips: ఇంట్లో ఈ 5 చోట్ల తులసి మొక్కని ఉంచి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోతారు!

Vastu Tips: ఇంట్లో ఈ 5 చోట్ల తులసి మొక్కని ఉంచి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోతారు!

by Srilakshmi Bharathi
Ad

ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఎందుకు ఉంటుందో తెలుసా?తులసి మొక్క ఆరోగ్యం మరియు సంపదకు చిహ్నం. దాదాపు ప్రతి హిందూ ఇంటిలో, మీరు తులసి యొక్క పవిత్రమైన మొక్కను చూడవచ్చు. చాలా మంది తులసి మొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ను పంపిస్తూ ఉంటుందని విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, విష్ణువుతో సహా దేవుళ్లందరికీ ఇష్టమైన మొక్క తులసి.

Advertisement

తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం మరియు సంరక్షణ చేయడం వల్ల కుటుంబంలో దీర్ఘాయువు మరియు శ్రేయస్సు లభిస్తుంది. అయితే మీ ఇంటికి శ్రేయస్సు తీసుకురావడానికి మీరు వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలని గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు సరైన సూర్యకాంతి లభించే ప్రదేశం అయ్యుండాలి. మీరు మీ ఇంటిలో తులసిని పెంచాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటె.. ఈ ఐదు ప్రదేశాల్లో మాత్రం తులసి మొక్కని ఉంచకండి.

Advertisement

Tulasi

తులసి మొక్కని వెలుతురు లేని చోట, చీకటిలో అస్సలు ఉంచకూడదు. తులసిని ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి. తులసి మొక్క ఎల్లప్పుడూ సంపదని తీసుకొస్తుందని చెబుతుంటారు. అందుకే తులసి మొక్క చుట్టూ శివుడి ఫోటోలను పెట్టకూడదు. ఇంటి పై కప్పు పై కూడా తులసిని పెట్టకూడదు. అక్కడ తులసిని పెడితే పేదరికం వస్తుంది. తులసి మొక్కని ఇంటికి తూర్పు దిశలో కానీ, ఉత్తర దిశలో కాని పెడితే సంపద లభిస్తుంది. ఉత్తర ఈశాన్య దిశలో తులసిని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. తులసిని దక్షిణ దిశలో పొరపాటున కూడా ఉంచకండి. ఈ దిశలో పెట్టడం వలన చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తులసి మొక్కని ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు తెలుసుకుని ఉండాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading