హిందువులు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటారు. దాంతో మనదేశంలో వాస్తు నిపుణులకు…. వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్త ఇల్లు నిర్మించాలన్నా… ఆఫీసు నిర్మించాలన్నా కచ్చితంగా వాస్తును ఫాలో అవుతారు. అంతేకాకుండా ఇంట్లో పెట్టే వస్తువుల విషయంలో కూడా వాస్తును ఫాలో అవుతూ ఉంటారు.
Advertisement
ఇక ఇంటిని నిర్మించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం… ఆలయానికి దగ్గరగా ఇంటినిర్మించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే నిజానికి ఆలయానికి దగ్గరగా ఇంటిని నిర్మించుకుంటే ప్రశాంతత ఉంటుంది. ఉదయాన్నే కీర్తనలు వినొచ్చు…. అంతే కాకుండా ప్రతిరోజూ పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆలయం నీడ మాత్రం ఇంటిపై పడకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఆలయానికి పక్కనే ఇంటిని నిర్మించుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Advertisement
ఆలయం నీడ ఇంటి పైన పడితే ఆ ఇంట్లో ఐశ్వర్యం తగ్గిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే ఇంటి పెద్దకు అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శివాలయం, విష్ణువు, శక్తి స్వరూప ఆలయాల నీడ ఇంటిపై అస్సలు పడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకవేళ ఆలయం పక్కన ఇంటిని కచ్చితంగా నిర్మించుకోవాల్సి వస్తే ఆ గుడి కోసం వంద బారుల స్థలాన్ని విడిచిపెట్టి నిర్మించుకోవాలని చెబుతున్నారు.