హిందువులు జ్యోతిష్యశాస్త్రాన్ని మరియు వాస్తుశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. వాస్తు సరిగ్గా ఉంటేనే ఇంట్లో వాళ్ల ఆరోగ్యాలు బాగుంటాయని..అనుకున్నవి జరుగుతాయని విశ్వసిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం కొన్ని నియమాలను చెబుతోంది. ఇంటికి దారి ఏ వైపున ఉండాలి..? ఇంట్లో వస్తువులు ఎక్కడ ఉండాలి ఇలా నిర్మాణం గురించి చెప్పడం తో పాటూ వాస్తు గురించి కూడా చెబుతుంది.
Advertisement
ఇంట్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల సమస్యలు తప్పవని వాస్తుశాస్త్రం పేర్కొంది. ఆ మొక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం….ఖర్జూర పండ్లు అంటే చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ చెట్టును పొలంలో పెంచుకుంటే సమస్య లేదు కానీ ఇంట్లో పెంచుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. దాని వల్ల నిత్య ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఈ మధ్య జాక్ ఫ్రూట్ చెట్లను కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు.
Advertisement
అయితే జాక్ ఫ్రూట్ చెట్లను కూడా ఇంట్లో పెంచుకోకూడదట. ఈ చెట్టును పెంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చి వారు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయట. రావిచెట్టుకును కూడా ఇంట్లో పెంచుకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. రావిచెట్టు ఆలయాల వద్ద ఉంటే మంచిదట. కానీ ఇంటి వద్ద రావిచెట్టు ఉంటే వినాశనానికి దారితీస్తుందని వాస్తుశాస్త్రం చెబుతుంది.
అదేవిధంగా ఇంటి ఆవరణలో మర్రి చెట్టు కూడా ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది. మరి చెట్టు వినాశనానికి దారి తీస్తుందని కాబట్టి ఇంటి ఆవరణలో ఎక్కడ మర్రిచెట్టు చూసినా వెంటనే తీసివేయాలనిచెబుతుంది. వీటితో పాటూ ఇంటి ఆవరణలో రేగిచెట్టు కూడా ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది. రేగి చెట్టు ఇంట్లో ఉంటే అశుభం అని వాస్తుశాస్త్రం లో ఉంది.
ALSO READ :బాలయ్య మట్లాడితే.. 6 నెలల దాకా అర్థం కాదు -నందమూరి లక్ష్మీ పార్వతి