Home » నాగబాబుకు షాక్.. వేరు కాపురం పెట్టనున్న వరుణ్ తేజ్..!

నాగబాబుకు షాక్.. వేరు కాపురం పెట్టనున్న వరుణ్ తేజ్..!

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరిద్దరూ గత ఐదు సంవత్సరాల కిందట ప్రేమించుకున్నారు. అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి.. ఇప్పటివరకు ప్రేమించుకుంటూనే ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఇటీవల ఇరు కుటుంబాలకు తెలియజేశారు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాటి.

Advertisement

దీంతో నాగబాబు కుటుంబం మరియు లావణ్య త్రిపాఠి కుటుంబం ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొన్న మణికొండలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమం నాగబాబు ఇంట్లో జరిగింది. ఇక నవంబర్ ఒకటో తేదీన స్పెయిన్ లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల వివాహం జరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఇలాంటి నేపథ్యంలో వరుణ్ తేజ్… నాగబాబు కుటుంబానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

లావణ్య త్రిపాటితో ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిన తర్వాత జూబ్లీహిల్స్ లో ఓ ఖరీదైన బంగ్లాను వరుణ్ తేజ్ కొనుగోలు చేశారట. అయితే లావణ్యతో పెళ్లి జరిగిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడట వరుణ్ తేజ్. దీంతో నాగబాబు కుటుంబాన్ని వదిలి… ఆ జూబ్లీహిల్స్ ఇంట్లో కాపురం చేయాలని వరుణ్ తేజ్ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో లావణ్య త్రిపాఠి రాగానే వరుణ్ తేజ్ కుటుంబాన్ని వదిలేస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading