Home » వరుణ్, లావణ్య ఇటలీలో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు..? ఇంత పెద్ద కారణం వుందా..?

వరుణ్, లావణ్య ఇటలీలో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు..? ఇంత పెద్ద కారణం వుందా..?

by Sravya
Ad

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో జరుగుతున్న విషయం తెలిసిందే కుమారుడు పెళ్లిని మెగా బ్రదర్ నాగబాబు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. వీళ్ళ పెళ్లికి ఇప్పటికే మెగా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లారు. ఈ వివాహ వేడుక ఏకంగా మూడు రోజులు పాటు జరగనుంది వీళ్ళ పెళ్లి వేడుకకు ఎన్నో ఏర్పాట్లు కూడా చేశారు. నవంబర్ 1న అంటే ఈరోజు ఇటలీలో గ్రాండ్ గా వీళ్ళ పెళ్లిని చేయబోతున్నారు. లావణ్య వరుణ్ ఒకటి కాబోతున్నారు. వీళ్ళ వివాహం తర్వాత రిసెప్షన్ ని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ డేట్ ని కూడా ఫిక్స్ చేసేసారు.

varuntej-lavanya Marriage

varuntej-lavanya Marriage

 

సినీ ప్రముఖులందరూ నవంబర్ ఐదున వీళ్ళ రిసెప్షన్ కి హాజరు కాబోతున్నారు అయితే అసలు వీళ్ళ పెళ్లిని ఎందుకు ఇటలీలో చేస్తున్నారు..? దానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వరుణ్ సోదరి నిహారిక పెళ్లి రాజస్థాన్లో వైభవంగా జరిపారు. ఇప్పుడు వరుణ్ పెళ్లి ఏకంగా ఇటలీలో చేస్తున్నారు. వరుణ్ లావణ్య కలిసి మిస్టర్ అంతరిక్షం అనే రెండు సినిమాల్లో నటించారు. అయితే మిస్టర్ సినిమా షూటింగ్లో కొన్ని సీన్లు ని ఇటలీలో షూట్ చేశారు కొన్ని పాటలు కూడా ఇటలీలోనే షూట్ చేశారు.

Advertisement

Advertisement

ఆ సమయంలో వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. అలా వీళ్ళు ప్రేమలో పడ్డారు. ప్రేమ పుట్టిన చోటనే ఒకటి అవ్వాలని అనుకున్నారట అందుకే ఇటలీలో వీళ్ళ పెళ్లిని ప్లాన్ చేశారు వీళ్ళ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటుగా సన్నిహితులందరూ కూడా ఇటలీ వెళ్లారు. సినిమాలు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో పాటు ఇటలీ చేరుకున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading