టాలీవుడ్ లోని పాటల రచయితల్లో చంద్రబోస్ ది ప్రత్యేకమైన స్థానం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను రాశారు. వరంగల్ కు చెందిన చంద్రబోస్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా తనకు పాటలపై సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆ దిశగా అడుగులు వేశారు. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజ్ మహల్ అనే సినిమాలో మంచుకొండల్లో చందమా చందనాలు చల్లిపో అనే పాటను రాశారు. ఆ తరవాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమాలో పాటలు రాసే అవకాశం దక్కించుకున్నాడు.
Advertisement
ఈ సినిమా తరవాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పీటలు సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమా సమయంలో చంద్రబోస్ కు కొరియోగ్రాఫర్ సుచిత్రతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ హైదరాబాద్ టూ చెన్నై కలిసి ప్రయాణ చేశారు. ఆ ప్రయాణంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
Advertisement
ఇద్దరి మనసులు కలవడంతో ఆ స్నేహం కాస్తా కొంతకాలానికి ప్రేమగా మారింది. ఇక మొదట చంద్రబోస్ సుచిత్రకు ప్రపోజ్ చేయగా ఆమె అంగీకరించలేదు. కానీ చంద్రబోస్ తనది టైం పాస్ లవ్ కాదని తన ప్రేమ గురించి సుచిత్రకు వివరించారు. ఆ తరవాత ఆమె కూడా ఒప్పుకున్నారు. అయితే చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరేళ్లు సీనియర్ కావడం విశేషం.
అయినప్పటికీ ఇద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటూ పెళ్లికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశారు. సుచిత్ర టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. నువ్వునాకు నచ్చావ్, మనసంతా నువ్వే, అన్నమయ్య, గోపాల గోపాల తో పాటూ మరికొన్ని సినిమాలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహరించారు.
Also read :
అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!