ఆత్రేయ ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరేమో. తెలుగు సినిమాకు పాటలు మాటలు రాసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆత్రేయ అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. నెల్లూరు జిల్లాలోని మంగలంపాడులో 1920లో జన్మించారు. ఆయన పేరు పిలవడానికి పొడవుగా ఉందని తనకు తానే ఆత్రేయ అని నామకరణం చేసుకున్నారు. ఇక చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఆత్రేయ విద్యాభ్యాసం చేసారు. సినిమాల్లోకి రాకముందు పాటలు నాటకాలు రాసి గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
మొదటి సారి ఆత్రేయ ఎన్టీఆర్ హీరోగా నటించిన దీక్ష సినిమాలో పోరా బాబు పో అనే పాటతో శ్రోతలను అరించారు. ఆ తరవాత ఏఎన్ఆర్ హీరోగా నటించిన తోడి కోడళ్లు సినిమాలో కారులో షికారు అనే పాట రాశారు. ఈ పాట తరవాత ఆత్రేయ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆత్రేయ శ్రీవెంకటేశ్వర మహత్యం సినిమాలో శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేష పాటతో మరి కొన్ని పాటలు రాశారు. ఈ సినిమా తరవాత ఆత్రేయ కేవలం ప్రేమ పాటలే కాకుండా భక్తి గీతాలు రాయడంతోనూ దిట్ట అని రుజువైంది.
Advertisement
అలా ప్రేమ, భక్తిరస గీతాలు, లాలి పాటలు అంటూ ఆత్రేయ అన్ని రకాల పాటలను రాశారు. వందల కొద్దీ పాటలు రాసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం పాటలే కాకుండా పదునైన మాటలు రాయడంలోనూ తనను తాను నిరూపించుకున్నారు. సామాన్యులకు అర్థమయ్యేలా వేదాలను తత్వాన్ని రాయడంతో ఆయనకు ఆయనే సాటి. ఆత్రేయ మాటైనా పాటలైనా కేవలం రాత్రి సమయాల్లోనే రాసేవారట. అందువల్లే ఆయనను అర్థరాత్రేయ అని కూడా సరదాగా పిలుచుకునేవారట.
అయితే ఆత్రేయ సమయానికి పాటలు రాయరని అందువల్లే ఆయనకు అవకాశాలు తగ్గాయని కూడా టాక్ వినిపించేది. ముందు చూపులేని కారణం ఆత్రేయ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదరుకున్నారట. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమ సినిమాలో తాను పాటలు రాస్తానని తన పేరు వేయడం కూడా అవసరం లేదని పరుచూరి బ్రదర్స్ ను వేడుకున్నారట. అంతే కాకుండా చివరి దశల్లో ఆత్రేయ తీవ్రమైన పేదరికాన్ని సైతం అనుభవించారట.