Home » నాగబాబు చేయాల్సిన గ్యాంగ్ లీడర్ చిరు చేయడం వెనుక నమ్మలేని నిజాలు..!!

నాగబాబు చేయాల్సిన గ్యాంగ్ లీడర్ చిరు చేయడం వెనుక నమ్మలేని నిజాలు..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా పేరుపొందిన హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ పేరు చెప్తేనే వారి అభిమానులకు గూస్ బామ్స్ పుడతాయి . అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆరు పదుల వయసు ఉన్నా కానీ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలో నటిస్తున్నారు. అలాంటి చిరంజీవి కెరియర్లో సంచలన విజయన్నాందుకున్న గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మూవీ 1991 మే 9న రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్షన్ చేసిన విజయ బాపినీడు ముందుగా నాగబాబుని హీరోగా పెట్టి తీయాలని భావించారట.

Advertisement

Also read;నాన్న-బాబాయ్ నెల రోజుల వ్యవధిలో మరణించడానికి కారణం వెల్లడించిన శ్వేత లక్ష్మీపతి..!

Advertisement

కానీ బాపినీడు డైరెక్షన్లో ముందుగా ఖైదీ నెంబర్ 786 మూవీ సమయంలో చిరంజీవి మరో సినిమా నీతోనే చేస్తానని బాపినీడుకు మాట ఇచ్చాడట. ఆ మాట ప్రకారమే బాపినీడికి చిరు కబురు పంపారు.. దీంతో టైం లేకపోవడంతో నాగబాబుతో తీద్దామని అనుకొని చిరంజీవికి వినిపిస్తే ఓకే చెప్పాడట. కానీ చిరంజీవికి ఇందులో గ్యాంగ్ లీడర్ టైటిల్ అస్సలు నచ్చలేదట. కానీ బాపినీడు ఎలాగొలా నచ్చజెప్పి చిరును ఒప్పించారట. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి అన్నయ్య కృష్ణంరాజును తీసుకుందామని అనుకున్నారట.కానీ చివరికి మురళీమోహన్ ని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో చిరంజీవికి ఊతపదం “రఫ్ఫాడిస్తా ” అనే ఐడియా చిరంజీవి ఇచ్చారని తెలుస్తోంది.

ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే దీన్ని శత దినోత్సవ వేడుకలను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న హైదరాబాద్, విజయవాడ, ఏలూరు,తిరుపతిలో నిర్వహించారు. ఇందులో మరో ముఖ్య విషయం విజయ్ మాల్యాకు చెందిన డోరినర్ అనే చార్టెడ్ ఫ్లైట్లో నటీనటులు సాంకేతిక నిపుణులు నాలుగు ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తోంది. ఆ రోజుల్లోనే గంటకు 40 వేల రూపాయలు అద్దె చెల్లించి, 12 గంటలకు 5 లక్షలు ఇచ్చారట. ఈ సినిమా తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తే ఘన విజయం అందుకుంది.

Also read;చిరంజీవి:కైకాల సత్యనారాయణకు ఆ రెండంటే చాలా ఇష్టం..!!

Visitors Are Also Reading