ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంటారు. అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా ఆ తరవాత వరుస ఆఫర్ లు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉదయ్ కిరణ్ మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన సినిమాల ద్వారా మదిలో నిలిచిపోయాడు.
Advertisement
కాబట్టి ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….2000 ల సంవత్సరంలో ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా వచ్చింది. ఈ సినిమాకు 35లక్షల కలెక్షన్ లు రాబట్టి ట్రెండ్ సెట్టర్ అయ్యింది. మరోసారి తేజ ఉదయ్ కిరణ్ కాంబోలో వచ్చిన సినిమా నువ్వునేను ఈ సినిమా 65లక్షల కలెక్షన్లు రాబట్టింది. 2001లో వచ్చిన మరోసినిమా మనసంతానువ్వే ఈ సినిమాకు విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి కోటిన్నరకు పైగానే వసూలు చేసింది.
Advertisement
2002లో వచ్చిన కలుసుకోవాలని 65లక్షలు వసూలు చేసింది. ఆ తరవాత ఉదయ్ కిరణ్ కు బిగెస్ట్ ఫ్లాప్ పడింది. మరోసారి ఉదయ్ కిరణ్ విఎన్ ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది. అయినప్పటికీ 65లక్షలు వసూలు చేసింది. ఉదయ్ కిరణ్ నటించిన మరో ప్రేమకథ నీస్నేహం సినిమా కూడా రూ.65లక్షల వరకూ వసూలు చేసింది. ఆ తరవాత వచ్చిన హోలీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 45లక్షలు మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది. 2003లో ఉదయ్ కిరణ్ హీరోగా జోడీ అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 35లక్షలు పెడితే కేవలం 25 మాత్రమే వసూలు చేసింది. నీకు నేను నాకు నువ్వు సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. 45లక్షలు ఖర్చు పెట్టగా 65లక్షలు వచ్చాయి. మళ్లీ తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా అవునన్నా కాదన్నా సినిమా వచ్చింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు 45లక్షలు వచ్చాయి. 2006లో కే బాలచందర్ ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో అవదం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా 30లక్షలు వసూలు చేసింది. 2007లో వియ్యాల వారి కయ్యాలు సినిమా వచ్చింది. ఈ సినిమాకు 30లక్షల కలెక్షన్ లు వచ్చాయి. 2008లో గుండె జల్లు మంది సినిమా వచ్చింది. ఈ సినిమా 40లక్షలు వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తరవాత వరుసగా అన్ని డిజాస్టర్లు గా నిలిచాయి. అంతే కాకుండా ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ విడుదలవకుండానే పోయింది.