ఉదయ్ కిరణ్ కి పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. లవర్ బాయ్ గా ఎన్నో సినిమాలలో నటించి అమ్మాయిల కలల రాకుమారుడుగా మారాడు. ఇక అమ్మాయిలకైతే ఉదయ్ కిరణ్ లాంటి అబ్బాయి భర్తగా రావాలని అనుకునేవారు. అంతలా ఉదయ్ కిరణ్ అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. ఉదయ్ కిరణ్ సినిమాల్లో రాణిస్తున్న సమయంలో ఓ పెద్దతప్పు చేశాడట. తాను చేసిన తప్పు వల్లే ఉదయ్ కిరణ్ కెరీర్ ఇలా అయ్యిందని చాలా రకాలుగా వార్తలు వచ్చాయి.
Advertisement
వివరాల్లోకి వెళితే…. ఉదయ్ కిరణ్ నటించిన ‘నువ్వు నేను’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, అనిత హీరో హీరోయిన్లుగా నటించారు. వారు ఆ సినిమా చేస్తున్న సమయంలోనే మంచి స్నేహితులు అయ్యారట. దాంతో అతి తక్కువ కాలంలోనే ఒకరికొకరు నచ్చడంతో ప్రేమించుకున్నారట. అలా కొన్ని రోజులపాటు వీరి రిలేషన్ కొనసాగుతుండగా ఉదయ్ కిరణ్ సడన్ గా ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పాడట. నేను ఇప్పుడు ప్రేమ అని నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు సినిమా అవకాశాలు రాకపోవచ్చు నా కెరియర్ అంతా పోతుంది అని అనితకి చెప్పారట.
Advertisement
ఇక ఉదయ్ కిరణ్ కెరీర్ నావల్ల దెబ్బ తినకూడదని భావించిన అనిత…. ఉదయ్ కిరణ్ ను అర్థం చేసుకొని అతనికి దూరంగా ఉందట. అలా అనిత పట్ల ఉదయ్ కిరణ్ చేసిన తప్పు వల్ల ఉదయ్ కిరణ్ కి శాపం తగిలిందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయిని కనుక అప్పుడే వివాహం చేసుకొని ఉంటే ఉదయ్ కిరణ్ కెరియర్ ఇప్పుడు చాలా బాగుండేది. ఇక ఉదయ్ కిరణ్ 2012 సంవత్సరంలో విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక అనుకోని కారణాలవల్ల ఉదయ్ కిరణ్ ఆత్మ***హత్య చేసుకున్నాడు. ఇక ఉదయ్ కిరణ్ మరణం ఇండస్ట్రీని కలచివేసింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!