టాలీవుడ్ లో చిన్నవయసులోనే కన్నుమూసిన తారల్లో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరవాత వరుసగా మరో రెండు హిట్ లను అందుకున్నాడు. ఇక హ్యాట్రిక్ కొట్టడంతో పాటూ లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడుగా ఉదయ్ కిరణ్ మారిపోయారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్టేటస్ ను సంపాదించుకోవడంతో దర్శకనిర్మాతలు సైతం ఉదయ్ కిరణ్ డేట్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి.
Advertisement
అంతే కాకుండా అప్పటికే స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరోల సినిమా ఫంక్షన్ లకు అతిధిగా వెళ్లాడు అంటే ఉదయ్ కిరణ్ రేంజ్ ఎక్కడకు వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంత స్పీడ్ గా ఉన్నత శిఖరాలను అందుకున్నాడో అంతే త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ డౌన్ ఫాల్ కూడా అయ్యింది. పర్సనల్ లైఫ్ తో కష్టాలు రావడంతో పాటూ కెరీర్ పరంగా కూడా కష్టాలు మొదలయ్యాయి. వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పాటూ వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.
Advertisement
దాంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. చివరికి ఉదయ్ కిరణ్ సినిమాలు విడుదలకు కూడా నోచుకోకపోవడంతో భరించలేక ఆత్మహ*కు పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయ్ కిరణ్ కు చిత్రం సినిమా ఆఫర్ రావడానికి కూడా చాలా కథ నడిచిందట.సినిమాల పై ఆసక్తితో ఉదయ్ కిరణ్ ఓ మోడలింగ్ ఏజెన్సీ లో చేరాడు. కాగా మొదట ఉదయ్ కిరణ్ తేజ కంటపడ్డాడు. అయితే ఉదయ్ కిరణ్ ను చిత్రంలో పెట్టి సినిమా చేయాలని తేజ అనుకోలేదట.
నిర్మాత రామోజిరావు కేవలం 40 లక్షల బడ్జెట్ లో సినిమా చేయాలని తేజకు కండిషన్ పెట్టాడట. దాంతో తేజ హీరోకు 11 వేల రెమ్యునరేషన్ మాత్రమే ఇవ్వగలమని కాబట్టి కొత్త హీరోను తీసుకోవాలని అనుకున్నారట. ఈనేపథ్యంలోనే మొదట ఉదయ్ కిరణ్ ను సెలెక్ట్ చేశాడట. కానీ రామోజీరావుకు ఉదయ్ కిరణ్ అంతగా నచ్చలేదట. దాంతో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడంతో పాటూ బ్యాగ్రౌండ్ ఉన్న ఓ కుర్రాడిని హీరోగా తీసుకోవాలని సూచించాడట. ఇక ఆ కుర్రాడి తల్లి రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో తేజ ఆ కుర్రాడిని పక్కన పెట్టి ఉదయ్ కిరణ్ తోనే సినిమా చేశాడు. ఇక అలా చేసిన చిత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే.
ALSO READ : తారకత్న భార్య అలేఖ్య రెడ్డికి చంద్రబాబు కీలక పదవి?