Home » ఈ 2 కారణాల వల్లే రేవంత్ ఇమేజ్ పెరిగింది.. కేసీఆర్‌ అవే మిస్ అయ్యారు…!

ఈ 2 కారణాల వల్లే రేవంత్ ఇమేజ్ పెరిగింది.. కేసీఆర్‌ అవే మిస్ అయ్యారు…!

by Sravya
Ad

రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. సీఎం పదవిని చేపట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకి స్పష్టమైన తేడాని ప్రజలు చూడడం జరుగుతోంది. కళ్ళ ఎదురుగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కంటే ఆకర్షించేది ఇంకేమీ లేదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ని ప్రకటించారు అది కూడా ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్లోనే. ప్రజా భావం గా పేరు మార్చి ప్రజలకు యాక్సిస్ ని ఇచ్చారు. అక్కడికే ప్రభుత్వాన్ని తీసుకువెళ్లారు ప్రజల బాధలు కూడా విన్నారు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

Advertisement

గతంలో ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ఒకటే మార్గం కనీసం ఎమ్మెల్యేలకి కేసీఆర్ దగ్గర యాక్సిస్ ఉండేది కాదు. ప్రగతిభవన్లోకి అడుగుపెట్టలేక పోయేవారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి మార్చేశారు ప్రజలు వెళ్లి నేరుగా సమస్యను చెప్పుకోవచ్చు కింద స్థాయిలో పరిష్కారం కుదరకపోతే సీఎం దగ్గరికే వెళ్లాలనుకుంటారు ప్రజలు ప్రజల్ని కలవడమే కేసీఆర్ మానేసారు. దీనిపై ఎన్నికల సమయంలో మీడియా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అసలు ప్రజల్ని కలవాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ చెప్పారు. అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని సీఎం దగ్గరికి రావాల్సిన పనిలేదని కేటీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారు.

Advertisement

ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్న ప్రజల సంఖ్య అది ఎంత తప్పు అనేది నిరూపిస్తోంది. ప్రభుత్వం జవాబుదారీగా ఉందని సమస్యలని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని నమ్మకం కలగడంతో ఇప్పుడు ప్రజావాణి క్యూ విపరీతంగా పెరిగింది. గత ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు ఇది ప్రజల్ని కూడా బాగా మెప్పిస్తోంది. ప్రతిపక్షనేతగా ఏం చేసినా కూడా తను ఇప్పుడు అధికారపక్ష నేతక వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎంచుకున్న సీఎం కనుక గౌరవానికి భంగం లేకుండా పాలన చేస్తున్నారు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నేతలకి అసెంబ్లీలో మాట్లాడేందుకు మైకు దొరికేది కాదు కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడారు ఇలా మార్పు కనిపించేలా చేశారని ప్రశంసలని పొందుతున్నారు రేవంత్ రెడ్డి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading