Home » ట్విన్స్ బేబీస్ కి జన్మనిచ్చిన సింగర్ చిన్మయి.. మీరు కూడా ఓ లుక్కేయండి..!

ట్విన్స్ బేబీస్ కి జన్మనిచ్చిన సింగర్ చిన్మయి.. మీరు కూడా ఓ లుక్కేయండి..!

by Sravanthi
Ad

సింగర్ చిన్మయి శ్రీపాద ఈమె గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ సింగర్ చాలాసార్లు ట్రోల్స్ బారిన పడింది. అయినా ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గకుండా కొంతమంది నెటిజన్స్ కు చురకలు అంటిస్తూ ముందుకు సాగుతోంది. ఆమె తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో పాటలు పాడి, మెప్పించింది. పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ కూడా చెబుతుంది ఈమె. ఈమె తన గాత్ర మాధుర్యంతో ఇప్పటికి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ అమ్మడుకు నటుడు రాహుల్ తో 2014లో పెళ్లి జరిగింది. వీరిద్దరూ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ రీసెంట్ గా ట్విన్స్ బేబీస్ కు జన్మనిచ్చారు.

ఇద్దరు పిల్లలు ఒక పాప, ఒకరు బాబు జన్మించారు. ఇందులో పాప పేరు ద్రిప్తా, బాబు పేరు శర్వాస్. ఈ మధ్య కాలంలోనే పిల్లలకు సంబంధించిన ఫస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు చిన్మయి. డాడీ బ్యూటీస్ అంటూ రాహుల్ తో పాప ఉన్న ఫోటో, నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలను చూసిన చాలా మంది అభిమానులు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ అనేక కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలను చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement

చిన్మయి తల్లి అయిందా. ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రాలేదు అంటూ రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో చిన్మయి నా క్లోజ్ సర్కిల్ లోపు ఉన్న వాళ్లకు మాత్రమే నా ప్రెగ్నెన్సీ విషయం తెలుసు. నేనే విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డాను.. నాకు నేను కాపాడుకోవడానికి ఆ విధంగా చేశాను. ఎప్పుడు కూడా నా వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చెయ్యను అని చిన్మయి ఒకానొక సమయంలో తెలియజేసింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

also read;

అప్పుడు నాకు సెన్స్ జ్ఞానం లేవు..నాగబాబు ఎమోష‌న‌ల్..!

మోహన్ బాబు కి పిల్లనివ్వడానికి కుడా ఎందుకు వణికిపోయేవారు ? రెండవ వివాహం ఎందుకు చేసుకున్నారంటే ?

 

Visitors Are Also Reading