దివంగత స్టార్ హీరో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి బాలయ్య వెళ్లారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి మండిపడ్డారు. వెంటనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయాలని చెప్పారు. తర్వాత అతని అనుచరులు చేశారు. ఇప్పుడు బాలయ్య పై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. కామన్ ఆడియన్స్ కూడా ఎన్టీఆర్ మీద సింపతీ ని చూపిస్తున్నారు. అలా ఈ టాపిక్ ట్రెండ్ అయిపోయింది. అయితే నిజానికి తప్పంతా బాలయ్యది అనడం కరెక్ట్ కాదు కదా..? మే 20 న హైదరాబాద్ కెపిహెచ్బిలో లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి.
Advertisement
Advertisement
ఆ వేడుకకి రామ్ చరణ్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఇన్వైట్ చేసినా రాలేదు ఎన్టీఆర్ జయంతి రోజున టిడిపి పార్టీ కార్యకర్తలు ఇచ్చిన పూలమాలను కూడా పక్కన పెట్టేసారు. ఎన్టీఆర్ పార్టీ ప్రచారానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఇవన్నీ కోపం తెప్పిచ్చాయి బాలయ్య కి. అయితే మరో పక్క బాలయ్య ఫ్లెక్సీలు తీర్చడానికి కారణం ఫ్లెక్సీలు మీద స్వాగతం అని ఉండడం అని కూడా వార్తలు వస్తున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!