Home » ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో సత్తా చాటిన ట్రాన్స్ జెండర్ అర్చన!

ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో సత్తా చాటిన ట్రాన్స్ జెండర్ అర్చన!

by Bunty
Ad

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సివిల్ కానిస్టేబుల్ లతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

 

దాదాపు 6500 కు పైగా ఉద్యోగాలను పోలీస్ శాఖలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.  అయితే ఈ టెస్ట్ లో విజయవాడ కండ్రికకు చెందిన కే.అర్చన అనే ట్రాన్స్ జెండర్ క్వాలిఫై అయింది. పుట్టుకతో తాను ట్రాన్స్ జెండర్ అనే విషయం తెలియదు. ఎదిగే క్రమంలో తెలిసి చాలా మధనపడిన అర్చన అందరిలా బ్రతకాలి అనుకోలేదు. తనలో ఉన్న టాలెంట్ కి తన జెండర్ అడ్డు కాకూడదు అనుకుంది.

Advertisement

పోలీస్ డ్రెస్ వేసి ప్రజలకు సేవ చేయాలనుకుంది. చుట్టుపక్కల వారి మాటల తూటాలకు ఆమె లొంగలేదు, బెదరలేదు. ధైర్యంగా నిలబడి చదువు కొనసాగించింది. పరీక్షల కోసం కష్టపడింది. మొత్తం 200 మార్కులకు పెట్టిన ప్రిలిమినరీ పరీక్షలో 60 మార్కులు సాధించి, ఉత్తీర్ణత పొంది తన సత్తా చాటింది కల్లిపల్లి అర్చన. ఇదే జోరుకొనసాగించి ఈవెంట్స్ లోను ఫైనల్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించి ట్రాన్స్ జెండర్స్ అందరికీ ఆదర్శం కావాలని మనసారా కోరుతున్నారు నెటిజన్లు.

READ ALSO : సింగర్ వాణి జయరామ్ పోస్టుమార్టం పూర్తి…తలపై పెద్ద గాయం!

Visitors Are Also Reading