Home » రైల్వే ప్ర‌యాణీకుల‌కు తీపిక‌బురు…వెల్ క‌మ్ చెప్పేందుకు ట్రైన్ హోస్టెస్..!

రైల్వే ప్ర‌యాణీకుల‌కు తీపిక‌బురు…వెల్ క‌మ్ చెప్పేందుకు ట్రైన్ హోస్టెస్..!

by AJAY
Ad

విమానాలలో ఎయిర్ హోస్టెస్ ఉంటారన్న‌ సంగతి తెలిసిందే. ప్రయాణికులకు అతిధి మర్యాదలు చేసేందుకు ఎయిర్ హోస్టెస్ ల‌ను విమానాల్లో నియమిస్తారు. ప్రయాణికులకు వెల్కమ్ చెప్పి వీరు అతిధి మర్యాదలు చేస్తూ ఉంటారు. నీళ్లు ఇవ్వడం, ఆహారం ఇవ్వడం ఇలా సేవలు చేస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తుంటారు. అయితే ఇప్పుడు దేశంలో నడుస్తున్న ప్రీమియం రైళ్లలో కూడా ప్రయాణికులకు ట్రైన్ హోస్టెస్ అతిధి మర్యాదలు లభించనున్నాయి.

Advertisement

train hostes

train hostes

విమానంలో ప్రయాణికులకు ఎలా స్వాగతం పలికి మర్యాదలు చేస్తారో అదేవిధంగా ట్రైన్ ల‌లో కూడా ట్రైన్ హోస్టెస్ ను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వీరు ప్రయాణికులకు వెల్క‌మ్ చెప్పడం… వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించడం అదే విధంగా ఆహారం అందించడం లాంటి విధులను నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా ట్రైన్ లో కూడా మహిళలు మరియు పురుషులు ట్రైన్ హోస్టెస్ లుగా ఉంటారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

త్వరలోనే అందుకోసం నియామక ప్రక్రియ కూడా ఉంటుందని తెలిపారు. అయితే ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 12 శతాబ్ది…. రెండు వందే భారత్, ఒక తేజస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తో కలిపి మొత్తం 25 రైళ్లు నడుస్తున్నాయి. ఈ ట్రైన్ లోనే ట్రైన్ హోస్టెస్ ల‌ను నియ‌మించాల‌ని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ‌యం ద్వారా రైళ్ల‌లో మెరుగైన స‌దుపాయాల‌తో పాటూ ప్రయాణికులను ఆక‌ర్షించి ఆదాయం పెంచుకోవాల‌నే నిర్ణ‌యం చేసింది.

Visitors Are Also Reading