టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు వివాహం జరిగిన కూడా ఆ వివాహాన్ని రద్దు చేసుకుని రెండో పెళ్లి చేసుకుంటారు. షూటింగ్ సమయంలో ప్రేమలో పడి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండవ వివాహం చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తల్లులు వేరైనప్పటికీ తండ్రి మాత్రం ఒక్కడే.. మరి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
# జూనియర్ ఎన్టీఆర్ – నందమూరి కళ్యాణ్ రామ్
వీరిద్దరూ నందమూరి హరికృష్ణ కుమారులు. హరికృష్ణ తన మొదటి భార్య లక్ష్మికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే, రెండవ భార్య శాలినీకి జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.
# మంచు విష్ణు – మంచు మనోజ్
Advertisement
మోహన్ బాబుకి రెండో వివాహం జరిగింది అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. మోహన్ బాబు మొదటి భార్యకు లక్ష్మి, విష్ణు జన్మించారు. తన మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఇక తన రెండవ భార్య నిర్మలాదేవికి మంచు మనోజ్ జన్మించాడు.
# అక్కినేని నాగచైతన్య – అఖిల్
వీరిద్దరి తండ్రి ఒక్కడే అయినప్పటికీ తల్లులు మాత్రం వేరు. నాగార్జున మొదటి భార్య లక్ష్మికి నాగచైతన్య జన్మించాడు. ఇక తనతో విడాకులు తీసుకున్న అనంతరం అమలను రెండవ వివాహం చేసుకున్నాడు నాగార్జున. ఇక అమలకు అఖిల్ జన్మించాడు.
# ఘట్టమనేని మహేష్ బాబు – నరేష్
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్యకు మహేష్ బాబు జన్మించాడు. ఇక కృష్ణ రెండవ భార్య విజయనిర్మల తన మొదటి భర్తకు నరేష్ జన్మించాడు. అయినప్పటికే నరేష్ ను…కృష్ణ తన సొంత కొడుకుల చూసుకున్నాడు.