Home » 40 ఏళ్ల వయసుపైబడినా….పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలు !

40 ఏళ్ల వయసుపైబడినా….పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలు !

by Bunty
Ad

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో తప్పకుండా వివాహం చేసుకోవాలి. ప్రస్తుతకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు చాలా వయసు వచ్చినా కూడా వివాహాలు చేసుకోవడం లేదు. దాదాపు 50 ఏళ్ల వయసు పైబడిన కూడా పెళ్లి అనే మాట ఎత్తకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

# ప్రభాస్

పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ వయసు 43 పైనే ఉంది. ఇప్పటికీ ప్రభాస్ వివాహం చేసుకోలేదు. ఇక ఈ మధ్యనే ఆది పురుష్ ఈవెంట్ లో త్వరలోనే వివాహం చేసుకుంటానని చెప్పుకొచ్చారు.

# విశాల్

హీరో విశాల్ గతంలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో కొంత కాలం ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కొన్ని రోజులపాటు గాఢప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఇక విశాల్ 2019లో వైజాగ్ అమ్మాయి అనిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఏమైందో తెలియదు ఈ వివాహం క్యాన్సిల్ అయింది. ఇతని వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు. ఇంకా వివాహం చేసుకోవడం లేదు.

# సుబ్బరాజ్

Advertisement

నటుడు సుబ్బరాజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇతని వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు. పెళ్లి అనేది చేసుకోవాలని అనిపించినప్పుడే చేసుకోవాలి. పెద్దల బలవంతంతో వివాహం చేసుకోకూడదు. నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని సుబ్బరాజు చెప్పుకోచ్చాడు.

# సుమంత్

అక్కినేని హీరో సుమంత్ గతంలో కీర్తి రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇతని వయసు ప్రస్తుతం 48 సంవత్సరాలు. ఇక కీర్తితో విడాకులు అనంతరం సుమంత్ ఇంతవరకు వివాహం చేసుకోలేదు.

siddarth

siddarth

# సిద్ధార్థ్

హీరో సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో విడిపోయారు. ఇతని వయసు 44 సంవత్సరాలు. ఇక విడాకుల అనంతరం సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి మాట ఎత్తడం లేదు.

ఇవి కూడా చదవండి 

టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం మిస్ చేసుకున్న నితిన్ ?

చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

Visitors Are Also Reading