టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహారం గా కొనసాగింది ఈ బ్యూటీ. ఏపీలోని విజయవాడకు చెందిన లయ.. భద్రం కొడుకు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత స్వయంవరం, ప్రేమించు, మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్ లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలు కూడా చేసింది ఈ బ్యూటీ.
అయితే ప్రస్తుతం హీరోయిన్ లయ అమెరికాలో ఉంటుంది. అక్కడే జాబ్ చేసుకుంటూ తన కుటుంబంతో లైఫ్ గడుపుతోంది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ లయను ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో సాయికిరణ్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా హీరో సాయికిరణ్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా తెలిపాడు.
Advertisement
హీరో సాయికిరణ్ మరియు లయ కాంబినేషన్ లో ప్రేమించు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో లయ బ్లైండ్ క్యారెక్టర్ చేసింది. కాగా ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారట. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ సాయికిరణ్ మరియు లయ జాతకాలు కలవలేదని ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. దీంతో సాయికిరణ్ మరియు లయ స్నేహితులుగానే మిగిలిపోయినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నటుడు సాయికిరణ్.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!