కింగ్ సినిమాలో నటించిన తర్వాత నాగార్జున పేరు కింగ్ నాగార్జునగా మారిపోయింది. నిజానికి నాగార్జున లీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా కింగ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మూడు దశాబ్దాల నుండి నాగార్జున ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అటు హీరోగానూ ఇటు వ్యాపారవేత్త గానూ సూపర్ సక్సెస్ అయ్యారు. అక్కినేని స్టూడియోస్ నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తూ అదేవిధంగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.
Advertisement
మరోవైపు వ్యాపార పటక ప్రకటనలు, టీవీ షోల ద్వారా కూడా నాగార్జున చేతినిండా సంపాదిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాగార్జునకు ఖరీదైన భూములు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జున మొదటగా మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షోకు హోస్టుగా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ టీవీ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్నారు. వరుసగా మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేశారు.
Advertisement
అంతేకాకుండా రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా సినిమాలు, టీవీ షోలు, వ్యాపార ప్రకటనల ద్వారా నాగార్జున నెలకు రూపాయలు 30 కోట్ల వరకు సంపాదిస్తున్నట్టు టాక్. అంతేకాకుండా ఇటీవల వెలుబడిన జూమ్ టీవీ కథనం ప్రకారం నాగార్జునకు దాదాపు రూ. 850 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగార్జున ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చైతూ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్స్ అందుకోగా అఖిల్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక నాగార్జున తో పాటూ అతడి వారసులు సైతం చేతి నిండా సంపాదిస్తున్నారు. దాంతో సినిమాలోనే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరిలోనూ ఆస్తుల విషయంలో నాగార్జున కింగ్ అనే చెప్పాలి.
ALSO READ : సమంత కాఫీ కామెంట్స్ ఎఫెక్ట్…బాధలో ఆ అగ్రిమెంట్స్ అన్నీ చింపేసిన నాగచైతన్య…?