ప్రస్తుతం టాలీవుడ్ లో ఫోక్ సింగర్ ల హవా కనిపిస్తోంది. ప్రతి సినిమాలోనూ ఫోక్ సింగర్ లతో పాటలు పాడించడం ఆ పాటలు సూపర్ హిట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు ఫోక్ సింగర్ లకు అవకాశాలు ఇస్తున్నారు. అలా సినిమాల్లో ఫోక్ సింగర్స్ సినిమాల్లో పాటలు పాడుతూ బిజీగా ఉన్నారు. అలా ఫోక్ సినిమాల్లో పాటలు పాడుతున్న ఫోక్ సింగర్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ లో ఫోక్ సింగర్ ల విషయానికి వస్తే మొదటగా గుర్తుకు వచ్చే పేరు మంగ్లీ. టీవీ యాంకర్ గా పరిచయమైన మంగ్లీ ఫోక్ సింగర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలకు పాటలు పాడుతూ ఆకట్టుకుంటోంది. అల వైకుంఠపురం సినిమాలో మంగ్లీ పాడిన రాములో రాములో పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Advertisement
Advertisement
బిమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ ను పాడిన కిన్నెర మొగులయ్య కిన్నెర కళాకారుడు. భీమ్లా నాయక్ సినిమాలో మొగులయ్య పాటిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అదే సినిమాలో దుర్గ భవాని అనే ఫోక్ సింగర్ అడవితల్లి పాను పాండింది. ఈమె మంచిర్యాల జిల్లా వాసి.
పుష్ప సినిమాలో సామీ రారా సామీ పాటను పాడిన సింగర్ మౌనిక యాదవ్ కూడా ఫోక్ సింగర్ కావడం విశేషం. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అంతేకాకుండా రంగస్థలం సినిమాలోని ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టునుంటావా అనే పాటను ఫోక్ సింగర్ శివనాగులు పాడి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక రీసెంట్ గా పుష్ప సినిమా నుండి విడుదలైన ఊ అంటావా…ఊ ఊ అంటావా మామా…. పాట పాడిన మంగ్లీ సోదరి ఇంద్రావతి కూడా మొదట ఫోక్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఆమె పుష్ప సినిమాలో పాడిన పాట కు భారీ రెస్పాన్స్ వస్తోంది.