ఇండస్ట్రీలో మొదటి హీరోగా పేరు తెచ్చుకున్నాడు కళ్యాణం వెంకటసుబ్బయ్య. ఈలపాట రఘురామయ్య అని కూడా ఈయనని పిలుస్తారు. ఆ పేరుతోనే ఆయన బాగా పాపులర్ అయ్యారు తెలుగు రంగస్థలం సినీ నటుడు గానే కాకుండా గాయకుడిగా కూడా రఘురామయ్య మంచి పేరుని తెచ్చుకున్నారు. గుంటూరు జిల్లా లో కళ్యాణం నరసింహారావు కళ్యాణం వెంకటసుబ్బయ్య దంపతులకి ఈయన జన్మించారు. చిన్నతనం నుండి సంగీతం నాటకాల్లో ఈయనకి మక్కువ ఉండేది. చిన్నతనం నుండే మ్యూజిక్ నాటకాలలో రాణించేవాడు. అతను తన గానంతో పశువులని కూడా మైమరిపించేలా చేసేవాడు.
Advertisement
ఈలలు వేస్తూ పాటలు పాడేవాడు. అందరిని బాగా ఆకట్టుకునేవాడు. ఒక నాటక బృందంలో చేరి రఘురాముని పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. కృష్ణుని పాత్రని కూడా అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్ తో పోల్చెంత బాగా నటించారు. రఘురామయ్య టాలెంట్ ని చూసి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ, వివి గిరి వంటి ప్రముఖులు ఆయనని అభినందించారు.
Advertisement
రఘురామయ్యకి ఎంత అరుదైన టాలెంట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 20వేల నాటకాలు 100 సినిమాల్లో నటించారు ఈయన శ్రీరామాంజనేయ యుద్ధంలో రామ నీల మేఘశ్యామతో సహా అనేక పాటలు పాడారు. 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈయన గుండెపోటుతో చనిపోయారు 1938లో రంగస్థలం నటి ఆదోని లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. ఈయన వారసత్వాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆయన జన్మస్థలమైన శుద్ధపల్లిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!