సినిమాలు హిట్ అయిన తర్వాత రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉంటారు హీరోలు, హీరోయిన్లు కూడా. సినిమాలు హిట్ అయిన తర్వాత డైరెక్టర్లు కూడా భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుంటారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా రాణిస్తున్న డైరెక్టర్ల రెమ్యూనరేషన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి:
Advertisement
దర్శకరుడు రాజమౌళి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపుని సంపాదించుకున్నారు రాజమౌళి. రాజమౌళి ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని వసూలు చేస్తున్నారు. ఆయన రెమ్యూనరేషన్ సినిమాకి 60 నుండి 65 కోట్ల వరకు ఉంది.
ప్రశాంత్ నీల్:
దర్శకుడు ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే సినిమాను బట్టీ 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్.
సుకుమార్:
Advertisement
సుకుమార్ విషయానికి వస్తే… సుకుమార్ పుష్ప ది రూల్ కోసం 50 కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నారు.
పూరీ జగన్నాథ్:
పూరీ జగన్నాథ్ దాదాపుగా 20 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే.. ఈయన ఒక్కొక్క సినిమాకి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ అయితే ఒక్కో సినిమాకి 40 కోట్లు తీసుకుంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్:
త్రివిక్రమ్ శ్రీనివాస్ 25 కోట్ల నుండి 30 కోట్ల దాకా తీసుకుంటున్నారు. ఇలా ఈ దర్శకులు సినిమాని బట్టి రెమ్యునరేషన్ ఈ లెవెల్ లో తీసుకుంటున్నారు. సినిమా సక్సెస్ అవ్వడం ప్లాప్ అవడం అనేది పూర్తిగా దర్శకులు చేతిలో ఉంటుంది. దర్శకులు తీసుకు వచ్చే కథని బట్టీ సినిమా రిజల్ట్ ఉంటుంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!