ఈ ఏడాది పలువురు టాలీవుడ్ నటీనటులు పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు కుటుంబం తో హ్యాపీగా గడుపుతున్నారు. ఇక. జంటల్లో కొంతమంది ప్రేమ వివాహం చేసుకుంటే మరికొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. అలా ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ సింగర్ సునిత ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు పాడారు. కాగా సునిత ఈ ఏడాది మాంగో మీడియా అధినేత రామ్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె భర్తతో హ్యాపీగా ఉంటూ మరోవైపు పాటలు పాడుతున్నారు.
Advertisement
ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో కార్తికేయ. మొదటి సినిమా తోనే కార్తికేయ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక కార్తికేయ. ఈఏడాది లోహిత రెడ్డి అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
Advertisement
బ్యాట్మింటన్ క్రీడాకారిని గుత్తా జ్వాల కోలీవుడ్ దర్శకుడు విష్ణు విశాల్ ను వివాహం చేసుకుంది. గుత్తా జ్వాల నితిన్ హీరోగా నటించిన గుండె జారీ గల్లంతయ్యిందే సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసింది. ఇక ప్రస్తుతం సినిమాల వైపు చూడటం లేదు గానీ దర్శకుడిని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు.
లవర్స్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆనంది ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోంది. కాగా ఆనంది ఈ ఏడాది సోక్రటీస్ అనే యువకుడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ యామి గౌతమ్. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. కాగా ఈ ఏడాది యామి గౌతమ్ దర్శకుడు ఆదిత్య దర్ ను వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.